4455 Bank Jobs : ప్రభుత్వ బ్యాంకుల్లో 4,455 జాబ్స్.. లాస్ట్ డేట్ ఆగస్టు 21
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,455 పోస్టుల భర్తీకి ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్’ (ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది.
- By Pasha Published Date - 12:55 PM, Sun - 4 August 24

4455 Bank Jobs : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,455 పోస్టుల భర్తీకి ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్’ (IBPS Notification) నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ప్రొబేషనరీ ఆఫీసర్లు(పీవో), మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు ఆగస్టు 21లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.175, ఇతరులు రూ.850 చొప్పున అప్లికేషన్ ఫీజును పే చేయాలి. అయితే 2024 ఆగస్టు 1 నాటికి 20 నుంచి 30 ఏళ్లలోపు వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
We’re now on WhatsApp. Click to Join
మొత్తం 4,455 పోస్టులలో(4455 Bank Jobs) అత్యధికంగా 1846 పోస్టులను యూఆర్ కేటగిరీకి కేటాయించారు. 1185 పోస్టులను ఓబీసీలకు కేటాయించారు. ఎస్సీ కేటగిరీకి 657 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 435 పోస్టులు, ఎస్టీ కేటగిరీకి 332 పోస్టులను కేటాయించారు. ఈ జాబ్స్‌లో అత్యధికంగా 2వేల పోస్టులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, 885 పోస్టులు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, 750 పోస్టులు కెనరా బ్యాంక్‌లో ఉన్నాయి. 360 పోస్టులు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో, 260 పోస్టులు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో, 200 పోస్టులు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఉన్నాయి.
- తొలుత అక్టోబరులో అభ్యర్థులకు ప్రిలిమ్స్ రాత పరీక్షను నిర్వహిస్తారు.
- ఇది ఆబ్జెక్టివ్ టెస్ట్. 60 నిమిషాలు జరిగే ఈ పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు లభిస్తుంది.
- ప్రిలిమ్స్ పరీక్షలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ – 30 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ – 35 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ – 35 ప్రశ్నలు ఉంటాయి.
- ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్లను అక్టోబరులో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు అక్టోబర్ నెలాఖరు లేదా నవంబర్‌లో రిలీజ్ అవుతాయి.
- నవంబరులో జరిగే మెయిన్ పరీక్షలో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ రకాల ప్రశ్నలను అడుగుతారు.
- మెయిన్ పరీక్షలో 155 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. పరీక్షా సమయం 3 గంటలు.
- రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ – 45 ప్రశ్నలకు 60 మార్కులు, జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్ – 40 ప్రశ్నలకు 40 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ – 35 ప్రశ్నలకు 40 మార్కులు, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రెటేషన్ – 35 ప్రశ్నలకు 60 మార్కులు కేటాయిస్తారు.
- మెయిన్స్ ఎగ్జామ్ కాల్‌లెటర్లను నవంబరులో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- డిసెంబర్ లేదా జనవరిలో రిజల్ట్స్ విడుదల అవుతాయి.
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరీక్షలో భాగంగా మనం ఆంగ్లంలో లెటర్చ, ఎస్సే రాయాలి. 2 ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 30 నిమిషాలు.
- మెయిన్ పరీక్షలో పాసయ్యాక జనవరి లేదా ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు జరుగుతాయి.
- అభ్యర్థులకు 2025 ఏప్రిల్‌లో అపాయింట్‌మెంట్ లెటర్లు కేటాయిస్తారు.