Fake Ration Card :ఫేక్ రేషన్ కార్డు, ఫేక్ వైకల్య సర్టిఫికెట్.. ట్రైనీ ఐఏఎస్‌పై దర్యాప్తులో సంచలనాలు
మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.
- Author : Pasha
Date : 17-07-2024 - 1:55 IST
Published By : Hashtagu Telugu Desk
Fake Ration Card : మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ట్రెయినీ ఐఏఎస్( IAS Trainee) పూజా ఖేద్కర్‌కు సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో ఆమె ప్రభుత్వానికి సమర్పించిన వైకల్య సర్టిఫికెట్‌లో ఒక ఫ్యాక్టరీ అడ్రస్ ఉందని గుర్తించారు. మహారాష్ట్రలోని చించ్వాడ్‌లో ఓ ఫ్యాక్టరీ ఉన్నట్లు గుర్తించారు. పూజా ఖేద్కర్ ఉపయోగించిన ఆడీ కారు కూడా ఇదే కంపెనీ పేరుతో రిజిస్టరై ఉందని తేలింది. ఆ కంపెనీ స్థానిక పురపాలక సంఘానికి రూ.2.7లక్షల పన్నులు బకాయి పడినట్లు తెలుస్తోంది. పూజా ఖేద్కర్ కోసం ఈ వైకల్య సర్టిఫికెట్‌ను 2022 ఆగస్టు 24న యశ్వంత్ రావ్ మెమోరియల్ ఆసుపత్రి జారీ చేసిందని వెల్లడైంది. అంతకుముందు 2022 సంవత్సరంలోనే వైకల్య ధ్రువీకరణ పత్రం కోసం ఔధ్ ఆసుపత్రికి పూజా ఖేద్కర్ దరఖాస్తు చేయగా.. అది తిరస్కరణకు గురైనట్లు తేలింది. యూపీఎస్‌సీ పరీక్షల టైంలో సమర్పించేందుకు అవసరమైన వైకల్య ధ్రువీకరణ పత్రాలను అహ్మద్‌నగర్ జిల్లా సివిల్ ఆసుపత్రి నుంచి పూజా ఖేద్కర్ పొందారు. యూపీఎస్సీకి పూజ సమర్పించిన పత్రాల్లో నకిలీ రేషన్ కార్డు కూడా ఉందని దర్యాప్తులో తేలింది.
We’re now on WhatsApp. Click to Join
వైకల్య ధ్రువీకరణ కోసం ఆధార్‌కార్డు తప్పనిసరి. కానీ, పూజా ఖేద్కర్ రేషన్‌కార్డు(Fake Ration Card) మాత్రమే సమర్పించారని అధికారులు గుర్తించారు. ఆమెకు లోకోమార్ వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్‌లో ఉంది. ఆమెకు మోకాలికి సంబంధించిన పాత గాయం ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో ఏడు శాతం వైకల్యం ఉన్నట్లు తేల్చారు. వాస్తవానికి యూపీఎస్సీలో వికలాంగ రిజర్వేషన్ పొందాలంటే 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉండకూడదు. కానీ, ఆమె వికలాంగ కేటగిరిలో సివిల్స్‌కు ఎలా ఎంపికైందనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.
Also Read : Desi Ghee : వర్షాకాలంలో దేశీ నెయ్యిని ఎలా ఉపయోగించాలి..?
ఈ ఫేక్ సర్టిఫికెట్ల బాగోతం బయటపడిన నేపథ్యంలో ఈనెల 23లోగా ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి ఐఏఎస్ అకాడమీకి తిరిగి రావాలని పూజా ఖేద్కర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈనేపథ్యంలో ఆమెను విధుల నుంచి రిలీవ్ చేస్తూ మహారాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం ప్రకటన విడుదల చేసింది. ఈ తరుణంలో పూణే జిల్లా కలెక్టర్ సుహాస్ దివాసేపై పూజా ఖేద్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.