Indian Air Force: ప్రధాని మోడీతో వాయుసేన చీఫ్ భేటీ.. కారణం అదేనా ?
వాయుసేన(Indian Air Force) అధిపతితో ప్రధాని మోడీ భేటీలో ఏ అంశాలపై చర్చ జరిగింది.
- By Pasha Published Date - 01:19 PM, Sun - 4 May 25

Indian Air Force: త్వరలోనే పాకిస్తాన్‌పై భారత్ దాడి చేయబోతోందా ? అందుకోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా ? కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసమే త్రివిధ దళాధిపతులు ఎదురు చూస్తున్నారా ? అంటే.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఆ దిశగానే సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఇవాళ(ఆదివారం) ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ భేటీ అయ్యారు. పాకిస్తాన్‌పై భారత్ దాడి చేసిన ప్రతిసారీ వాయుసేన అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. గతంలో సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా వాయుసేనే ముందంజలో నిలిచింది. అయితే ఈసారి వాయుసేన ఏం చేయబోతోంది ? పాక్ ఆక్రమిత కశ్మీరులోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తుందా ? లాహోర్‌లో దాక్కున్న లష్కరే తైబా చీఫ్ హఫీజ్ సయీద్‌ను అంతం చేసేందుకు కోవర్ట్ ఆపరేషన్ నిర్వహిస్తుందా ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వాయుసేన(Indian Air Force) అధిపతితో ప్రధాని మోడీ భేటీలో ఏ అంశాలపై చర్చ జరిగింది. వాయుసేన అధిపతికి ప్రధాని ఇచ్చిన ఆదేశాలు ఏమిటి అనేది తెలియాల్సి ఉంది.
Also Read :Swami Sivananda Saraswati: యోగా గురువు శివానంద సరస్వతి ఇక లేరు.. జీవిత విశేషాలివీ
కొన్ని గంటల ముందే నేవీ చీఫ్ సైతం..
అంతకుముందు శనివారం రోజు భారత నేవీ చీఫ్ (చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్) అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠి కూడా ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. నిన్న నేవీ చీఫ్, ఇప్పడు వాయుసేన చీఫ్‌లు ప్రధాని మోడీని కలిశారంటే.. ఏదైనా బలమైన కారణం ఉండి ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడికి స్పందించే విషయంలో భారత త్రివిధ దళాలకు ప్రధాని మోడీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. దీనిపై ఏప్రిల్ 29న ఆయన కీలక ప్రకటన చేశారు. దీంతో తమకు ఇచ్చిన స్వేచ్ఛను వినియోగించుకొని త్రివిధ దళాలు పాకిస్తాన్‌పై దాడి కోసం ఒక సమగ్ర ప్రణాళికను తయారుచేసుకొని ఉంటాయని భావిస్తున్నారు. ఆ వివరాలను ప్రధాని మోడీకి వివరించి, ఆయన ఆమోదాన్ని పొందేందుకు భేటీ అయి ఉండొచ్చని అనుకుంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే.. రేపో, మాపో పాకిస్తాన్‌పై భారత సైన్యం దాడి చేస్తుందని భావిస్తున్నారు.
Also Read :Rahul Gandhi : సిక్కు వ్యతిరేక అల్లర్లపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
నేవీ రంగంలోకి దిగితే.. పెద్ద యుద్ధమే..
గతంలో పాకిస్తాన్‌తో పెద్దస్థాయి యుద్ధాలు జరిగినప్పుడు మాత్రమే నౌకాదళాన్ని భారత్ వినియోగించింది. ఒకవేళ ఈసారి కూడా నేవీని ఉపయోగిస్తున్నట్లయితే.. జరగబోయేది పెద్దస్థాయి యుద్ధమే అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారత నేవీ రంగంలోకి దిగినప్పుడల్లా పాకిస్తాన్ తోక ముడవాల్సి వచ్చింది. ఎందుకంటే పాక్ నౌకాదళం చాలా వీక్. భారత్ వద్దనున్న విమాన వాహక నౌకలు, జలాంతర్గాముల ఎదుట అది నిలువలేదు. 1971లో డిసెంబరు 3 నుంచి డిసెంబరు 16 వరకు భారత్ – పాక్ యుద్ధం జరిగింది. అందులో విజయం భారత్‌ను వరించింది. పాకిస్తాన్ రెండు ముక్కలైంది. పాకిస్తాన్‌లోని ఒక భూభాగం బంగ్లాదేశ్ అనే ప్రత్యేక దేశంగా ఏర్పడింది. నాటికి, నేటికి ప్రధాన తేడా ఏమిటంటే.. నాడు పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు లేవు. ఇప్పుడు ఆ దేశం వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయి. 1998 సంవత్సరంలో చైనా రహస్య సహకారంతో అణ్వస్త్రాలను పాకిస్తాన్ రెడీ చేసుకుంది.