Swami Sivananda Saraswati: యోగా గురువు శివానంద సరస్వతి ఇక లేరు.. జీవిత విశేషాలివీ
స్వామి శివానంద సరస్వతి 1896 ఆగస్టు 8న అవిభాజ్య భారతదేశంలోని బంగ్లాదేశ్‌లో ఉన్న సిల్హెత్ ప్రాంతంలో(Swami Sivananda Saraswati) జన్మించారు.
- By Pasha Published Date - 12:53 PM, Sun - 4 May 25

Swami Sivananda Saraswati: ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద సరస్వతి 128 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. శివానంద మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన యోగా రంగానికి చేసిన అసమానమైన కృషిని మోడీ కొనియాడారు. దేశంలోని ప్రతి తరానికి శివానంద స్ఫూర్తినిస్తూనే ఉంటారన్నారు. ఆయన మృతి భారత యోగా రంగానికి తీరని లోటు అని ప్రధాని చెప్పారు.
125 Year old Yoga Guru from Kashi, Swami Sivananda receives the Padma Shri award from President Ram Nath Kovind#PeoplesPadma #SivanandaSwami #PadmaAwards2022 @PadmaAwards @mygovindia pic.twitter.com/XFQ3QPHQtf
— DD India (@DDIndialive) March 21, 2022
Also Read :Rahul Gandhi : సిక్కు వ్యతిరేక అల్లర్లపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
స్వామి శివానంద సరస్వతి గురించి..
- స్వామి శివానంద సరస్వతి 1896 ఆగస్టు 8న అవిభాజ్య భారతదేశంలోని బంగ్లాదేశ్‌లో ఉన్న సిల్హెత్ ప్రాంతంలో(Swami Sivananda Saraswati) జన్మించారు.
- ఆరేళ్ల వయసులోనే శివానంద తల్లిదండ్రులు చనిపోయారు.
- దీంతో ఆయన పశ్చిమ బెంగాల్‌లోని ఒక ఆశ్రమంలో పెరిగారు.
- స్వామి శివానంద సరస్వతిని గురు ఓంకారానంద గోస్వామి పెంచి పెద్ద చేశారు. యోగా వంటి ఆధ్యాత్మిక విషయాలను ఆయనకు నేర్పించారు.
- స్వామి శివానంద తన జీవితాన్ని సమాజసేవకు అంకితంచేశారు.
- గత 50 ఏళ్లుగా ఆయన పూరీలో 400 నుంచి 600 మంది కుష్టు రోగులకు సేవ చేశారు.
- యోగా రంగానికి చేసిన కృషికిగానూ 2022లో శివానందకు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేశారు.తెల్లటి ధోవతి, కుర్తా ధరించి కాళ్లకు చెప్పులు లేకుండా వచ్చి ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
Also Read :Water Attack : పాక్‌పై వాటర్ స్ట్రైక్.. బాగ్లిహార్ డ్యాం గేట్లు క్లోజ్
- ఈ ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరిగిన మహాకుంభ మేళాలోనూ స్వామి శివానంద పాల్గొన్నారు. గత వందేళ్లుగా ప్రతీసారి మహాకుంభ మేళాాలో ఆయన పాల్గొంటూ వస్తున్నారు.
- పద్మశ్రీతో పాటు యోగ రత్న అవార్డు, వసుంధరా రత్న అవార్డులను సైతం ఆయన పొందారు.
స్వామి శివానంద జీవన శైలి ఇలా ఉండేది..
- స్వామి శివానంద 128 ఏళ్ల పాటు ఆరోగ్యంగా జీవించారు. తుదిశ్వాస విడిచే వరకు ఆయన శరీరంలోని భాగాలన్నీ సక్రమంగా పనిచేశాయి.
- స్వామి శివానంద దినచర్య విషయానికొస్తే.. ఆయన రోజూ వేకువజామున 3 గంటలకు నిద్రలేచే వారు. ఆ వెంటనే యోగా ప్రాక్టీస్ చేసేవారు.
- ఆయన తన ఆహారంగా బియ్యాన్ని, ఉడకబెట్టిన పప్పులను, పచ్చి మిరపకాయలను తీసుకునేవారు.
- స్వామి శివానంద రోజూ ఒక మ్యాట్‌పై నిద్రపోయే వారు. కర్రతో చేసిన చెక్కలను తలగడలుగా ఆయన వినియోగించేవారు.