Republic Day: గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిని ఎలా ఎంపిక చేస్తారు..?
భారతదేశం 75వ గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) శుక్రవారం (జనవరి 26, 2024) జరుపుకోబోతోంది. గణతంత్ర దినోత్సవానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈసారి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా భారత్ రానున్నారు.
- Author : Gopichand
Date : 25-01-2024 - 9:49 IST
Published By : Hashtagu Telugu Desk
Republic Day: భారతదేశం 75వ గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) శుక్రవారం (జనవరి 26, 2024) జరుపుకోబోతోంది. గణతంత్ర దినోత్సవానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈసారి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా భారత్ రానున్నారు. గణతంత్ర దినోత్సవానికి విదేశీ నాయకుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించే సంప్రదాయం కొన్నాళ్లుగా ఉంది. గతేడాది ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్-సిసి ముఖ్య అతిథిగా వచ్చారు.
నివేదికల ప్రకారం.. రిపబ్లిక్ డే నాడు జరిగే పరేడ్‌కు ముఖ్య అతిథి ఎవరూ హాజరుకానప్పుడు ఇది ఇప్పటివరకు కేవలం 5 సార్లు మాత్రమే జరిగింది. 1950లో అప్పటి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో ఆ దేశ తొలి గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా భారతదేశానికి వచ్చారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఎవరు రావాలనేది ఎలా నిర్ణయిస్తారో ఈరోజు తెలుసుకుందాం.
Also Read: Bomb Threat Call: స్పైస్ జెట్ విమానానికి బాంబు బెదిరింపు కాల్.. ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్..!
గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిని ఎలా ఎంపిక చేస్తారు?
రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథిగా ఎవరు రావాలో నిర్ణయించడానికి 6 నెలల ప్రక్రియ ఉంటుంది. ముందుగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొన్ని దేశాల ప్రధానులు, అధ్యక్షుల పేర్ల జాబితాను సిద్ధం చేస్తుందని దౌత్యవేత్త మన్బీర్ సింగ్ తెలిపారు. ఆ తర్వాత ఈ జాబితాను ప్రధాని, రాష్ట్రపతికి పంపుతారు. వారు జాబితాను ఆమోందిచాల్సి ఉంటుంది. ఆమోదం పొందిన తర్వాత జనవరి 26న ముఖ్య అతిథిగా ఎవరు హాజరు కావచ్చో తెలుసుకోవడానికి భారతదేశం ఆ దేశాలతో మాట్లాడుతుంది. వారి ప్రణాళికలు ఏమిటి..? వారికి సమయం ఉందా..? ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటారు.
We’re now on WhatsApp. Click to Join.
భారతదేశంతో రాజకీయ, ఆర్థిక, సైనిక, వాణిజ్య సంబంధాల ఆధారంగా దేశాల జాబితాను తయారు చేస్తారు. ఇతర దేశాల ప్రధానులను లేదా అధ్యక్షులను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఆ దేశం పట్ల స్నేహ హస్తం చాచినట్లుగా భావిస్తుంటామని ఇరు దేశాల అధికారులు చెబుతుంటారు. ఈసారి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా భారత్ వస్తున్నారు. ఆయనతో పాటు రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్ను, ఆర్థిక మంత్రి బ్రూనో లే మేరీ, విదేశాంగ మంత్రి స్టెఫాన్ సెజోర్న్, జనరల్ థియరీ బుర్చర్డ్ కూడా ఉన్నారు.