At Least Four Kids : నలుగురు పిల్లల్ని కనే దంపతులకు రూ.లక్ష : మధ్యప్రదేశ్ బోర్డు ఆఫర్
‘‘నలుగురు పిల్లలను(At Least Four Kids) కనే బ్రాహ్మణ దంపతులకు రూ.లక్ష నజరానా ఇస్తాం’’ అని ఏకంగా ఒక ప్రభుత్వ సంస్థ ప్రకటించింది.
- By Pasha Published Date - 06:57 PM, Mon - 13 January 25

At Least Four Kids : ‘‘ఇద్దరు ముద్దు.. ముగ్గురు వద్దు..’’ అంటూ జనాభా నియంత్రణపై యుద్ధ ప్రాతిపదికన వీధివీధిన ప్రచారం చేసిన దేశం మనది. ఆ ప్రచారం పుణ్యమా అని మన దేశ జనాభా ప్రస్తుతం కొంత నియంత్రణలో ఉంది. లేదంటే ఈపాటికి భారతదేశ జనాభా ఏ 200 కోట్లకు చేరుకొని ఉండేదో. అయితే తాజాగా జనాభా అంశంపై ఓ సంచలన ప్రకటన వార్తల్లోకి వచ్చింది. ‘‘నలుగురు పిల్లలను(At Least Four Kids) కనే బ్రాహ్మణ దంపతులకు రూ.లక్ష నజరానా ఇస్తాం’’ అని ఏకంగా ఒక ప్రభుత్వ సంస్థ ప్రకటించింది. అది కూడా బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. అదేంటో ఈ వార్తలో చూద్దాం..
Also Read :Samsung : గెలాక్సీ ఎస్ సిరీస్ కోసం రిజర్వేషన్‌ను ప్రారంభించిన సామ్‌సంగ్
పరశురామ్ కల్యాణ్ బోర్డు అనేది మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సంస్థ. ఈ బోర్డుకు అధ్యక్షుడిగా పండిత్ విష్ణు రాజోరియా వ్యవహరిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వివాదాస్పద ప్రకటన చేశారు. ‘‘బ్రాహ్మణ కమ్యూనిటీ వారు తమ జనాభాను పెంచుకునేందుకు ఎక్కువ మంది సంతానాన్ని కనాలి’’ అని పండిత్ విష్ణు రాజోరియా పిలుపునిచ్చారు. నలుగురు పిల్లలను కనే బ్రాహ్మణ దంపతులకు రూ.లక్ష నజరానా ఇస్తామని వెల్లడించారు.
Also Read :Steve Jobs Wife : స్టీవ్ జాబ్స్ భార్య పేరు ఇక కమల.. ఎందుకంటే ?
‘‘మన బ్రాహ్మణ వర్గం వాళ్లం కుటుంబాలపై దృష్టి పెట్టడం మానేశాం. ఈ మధ్య మన వర్గానికి చెందిన యువత ఒక బిడ్డను కని అంతటితో ఆగిపోతున్నారు. ఇది చాలా సమస్యాత్మకంగా మారుతోంది’’ అని పండిత్ విష్ణు రాజోరియా చెప్పుకొచ్చారు. ‘‘బ్రాహ్మణ వర్గం భవిష్యత్ తరాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే. అందుకే బ్రాహ్మణ దంపతులకు కనీసం నలుగురు సంతానం ఉండాలి’’ అని ఆయన కోరారు. నలుగురు పిల్లల్ని కనే మహిళలకు బోర్డు తరఫున రూ.లక్ష అందిస్తామన్నారు. తాను బోర్డు అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత కూడా ఈ అవార్డు కొనసాగేలా చూస్తానన్నారు.