Rajendra Prasad Daughter: టాలీవుడ్‌లో పెను విషాదం.. రాజేంద్రప్రసాద్ కూతురు కన్నుమూత
గాయత్రి మరణవార్తను తండ్రి రాజేంద్రప్రసాద్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె న్యూట్రిషియన్‌గా సలహాలు ఇచ్చేది. గాయత్రి భర్త మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.
- By Gopichand Published Date - 07:21 AM, Sat - 5 October 24

Rajendra Prasad Daughter: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ కూతురు (Rajendra Prasad Daughter) గాయత్రి (38) గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. రాజేంద్రప్రసాద్‌కు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. శుక్రవారం గుండెపోటు రావడంతో గాయత్రిని ఆసుపత్రికి తరలించారు. గాయత్రి మరణవార్తను తండ్రి రాజేంద్రప్రసాద్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె న్యూట్రిషియన్‌గా సలహాలు ఇచ్చేది. గాయత్రి భర్త మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. గాయత్రికి ఒకరు కూతురు. ‘మహానటి’ సినిమాలో చిన్ననాటి సావిత్రి పాత్రను గాయత్రి కూతురు పోషించారు. ఆదివారం ఆమె అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజేంద్రప్రసాద్ కూతురు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఆమె మృతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సినీ నటుడు రాజేద్రప్రసాద్ కూతురు గాయత్రి (38) హార్ట్ ఎటాక్ తో మృతి.
Gone too soon!
Heartfelt condolences to Rajendra Prasad garu and his family.
Om Shanti 🙏 pic.twitter.com/fA74ozZR1P
— idlebrain.com (@idlebraindotcom) October 5, 2024
Also Read: IND vs BAN T20 series: గ్వాలియర్ లో పరుగుల వరదే తొలి టీ ట్వంటీ పిచ్ రిపోర్ట్ ఇదే
నిన్న రాత్రి గ్యాస్ట్రిక్ సమస్యతో చికిత్స పొందుతున్న సమయంలో అర్థరాత్రి 12.40 గంటల సమయంలో ఆమెకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయినట్లు బంధువులు చెబుతున్నారు. మరోవైపు గాయత్రి మరణ వార్త విన్న టాలీవుడ్ పెద్దలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే సినీ నటులు రాజేంద్రప్రసాద్ ఇంటికి చేరుకుంటున్నారు.