Kolkata Rape-Murder: కోల్‌కతా ఆసుపత్రి విధ్వంసం కేసులో అరెస్ట్ అయిన జిమ్ ట్రైనర్
ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు నిరసనగా వైద్యులు అర్ధరాత్రి నిరసన చేస్తుండగా హింసపై విమర్శలు ఎదుర్కొన్న పోలీసులు ఆస్పత్రిపై విధ్వంసానికి పాల్పడిన కొందరు అనుమానిత వ్యక్తుల 76 ఫోటోలను విడుదల చేశారు
- By Praveen Aluthuru Published Date - 02:12 PM, Sun - 18 August 24

Kolkata Rape-Murder: కోల్‌కతా ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్య యావత్ ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. అర్ధరాత్రి ఆస్పత్రిలో ఓ డాక్టర్ అత్యాచారానికి గురై, ఆపై హత్యకు గురి కావడంతో దేశం అట్టుడికిపోతోంది.అయితే ఇందుకు నిరసనగా అనేక మంది ఆస్పత్రిపై దాడికి దిగారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో 24 ఏళ్ల ఫిట్‌నెస్ శిక్షకుడు కూడా ఉన్నాడు. సౌవిక్ దాస్ ఆస్పత్రిపై దాడికి పాల్పడ్డట్లు అంగీకరించాడు. అయితే ఇదంతా ఎవరి ప్రోద్బలంతో జరగలేదు. కానీ ఇప్పుడు నేను నేరం చేశానని అర్థమైంది అని దాస్ అన్నారు.
ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు నిరసనగా వైద్యులు అర్ధరాత్రి నిరసన చేస్తుండగా హింసపై విమర్శలు ఎదుర్కొన్న పోలీసులు ఆస్పత్రిపై విధ్వంసానికి పాల్పడిన కొందరు అనుమానిత వ్యక్తుల 76 ఫోటోలను విడుదల చేశారు మరియు 30 మందిని అరెస్టు చేశారు. అందులో చాలా మంది ఆసుపత్రికి ఐదు కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్నారు. కొందరు వారి స్నేహితులతో వెళ్ళారు. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో జిమ్ శిక్షకుడు మరియు స్థానిక టిఎంసి కార్యకర్త దాస్ నివాసం. ఘటన జరిగినప్పటి నుండి అతను ఇంటికి రాలేదు. చివరికి అతన్ని అరెస్టు చేశారు.
“నేను తప్పు చేశాను. పశ్చాత్తాపపడుతున్నాను. మేమంతా శ్యాంబజార్ నుండి వెళ్ళాము.మేము ఉద్వేగభరితంగా ఉన్నాము… నా జిమ్‌లోని చాలా మంది అక్కడికి కూడా వెళ్ళారు అని B.Com గ్రాడ్యుయేట్ అయిన దాస్ ఓ ఛానెల్‌తో అన్నాడు. అతను స్థానిక TMC నాయకుడు మరియు వార్డు నంబర్ 14 కౌన్సిలర్ అయిన సుకాంత సేన్ శర్మకు తెలిసినవాడని స్థానికులు చెప్పారు. అయితే సుకాంత మాత్రం అతను నాకు తెలియదని వాదించాడు. అతను మా పార్టీకి చెందిన వాడని నేను అనుకోవడం లేదన్నాడు.
హత్యకు గురైన తమ సహోద్యోగికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైద్యులు నిరసనలు చేపట్టారు. దేశవ్యాప్తంగా బాధిత యువతికి న్యాయం చేయాలనీ కోరుతున్నారు.
Also Read: AI Human Robot : సరిహద్దుల్లో శత్రువుల భరతం పట్టే ఏఐ రోబో రెడీ