Grooms Nose Is Small: ఇదేందయ్యా ఇది.. వరుడి ముక్కు చిన్నగా ఉందని పెళ్లి క్యాన్సిల్.!
- Author : Gopichand
Date : 09-12-2022 - 11:01 IST
Published By : Hashtagu Telugu Desk
ఈ మధ్య మండపానికి చేరుకున్న వివాహాలు (weddings) కూడా చిన్న చిన్న కారణాలతో ఆగిపోతున్నాయి. మొన్నటికి మొన్న తన కోడలు కొన్న లెహంగా నచ్చలేదని, మరో ఘటనలో పెళ్లి మండపంలో ముద్దుపెట్టుకున్నాడని వధువు పెళ్లి (weddings) రద్దు చేసుకుంది. ఇప్పుడు అదే తరహాలో మరో పెళ్లి వివాదం తలెత్తింది. ముక్కు చిన్నదనే కారణంతో ఈ పెళ్లి వద్దు అని వధువు తేల్చి చెప్పింది. సిల్లీగా అనిపించినా సీరియస్‌గా అనిపించే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలోని బిలాల్‌పట్ గ్రామంలో వెలుగుచూసింది. పెళ్లికొడుకు ముక్కు చిన్నగా ఉందని కొంతమంది మహిళలు గుసగుసలాడుకోవడం వధువు చెవిలో పడటంతో అతడ్ని చేసుకోనంటే చేసుకోనని మొండికేసింది. కుటుంబసభ్యులు, పెద్దలు ఎంతగా నచ్చజెప్పినా ఆమె మాత్రం ససేమిరా అంది. దీంతో వివాహం రద్దయ్యింది.
Also Read: Cylinder Explosion: పెళ్లి వేడుకలో తీవ్ర విషాదం.. ఐదుగురు దుర్మరణం
తల్లిదండ్రుల అంగీకారంతో ఆ గ్రామంలో ఓ యువతి, యువకుడు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అనంతరం వివాహ వేడుకల్లో భాగంగా వరుడి కుటుంబీకులు ఊరేగింపుగా వధువు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన కొందరు వరుడి ముక్కు చిన్నగా ఉందని గుసగుసలాడుకున్నారు. అది విని పెళ్లికూతురు.. వరుడి ముక్కు నిజంగా చిన్నదే అనుకుంది. పెళ్లికి నో చెప్పింది. పెళ్లి చేసుకోనని చెప్పింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.