Angel Tax : స్టార్టప్‌లలో పెట్టుబడులపై ఏంజెల్ ట్యాక్స్ రద్దు.. ఏమిటీ ట్యాక్స్ ?
స్టార్టప్‌లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు.
- By Pasha Published Date - 01:20 PM, Tue - 23 July 24

Angel Tax : స్టార్టప్‌లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. స్టార్టప్‌లలోని అన్ని కేటగిరీలకు చెందిన పెట్టుబడిదారులపై ఏంజెల్ ట్యాక్స్‌ను రద్దు చేస్తున్నట్లు ఆమె మంగళవారం పార్లమెంటులో అనౌన్స్ చేశారు. భారతీయ స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను బలోపేతం చేసే సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join
ఏంజెల్ ట్యాక్స్ అంటే ?
ఏంజెల్ ట్యాక్స్ అనేది ఒక రకమైన ఆదాయపు పన్ను. దేశంలోని స్టార్టప్‌లు లేదా అన్ లిస్టెడ్ కంపెనీలు ఇన్వెస్టర్ల నుంచి సమీకరించే పెట్టుబడులపై ఏంజెల్ ట్యాక్స్(Angel Tax) విధించేవారు. స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులు ఆ సంస్థ షేర్లను వాటి వాస్తవిక ధర కంటే ఎక్కువ రేటుకు ఇన్వెస్టర్లకు విక్రయించి నిధులు సమీకరించిన సందర్భాల్లో ఏంజెల్ ట్యాక్స్‌ను విధించేవారు. ఇకపై స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేసే వారికి ఆ బాధ ఉండదు. డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) చేసిన సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వం స్టార్టప్‌ల పెట్టుబడులపై ఏంజెల్ ట్యాక్స్‌ను తొలగించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద 1.17 లక్షలకుపైగా స్టార్టప్‌లు రిజిస్టర్ అయి ఉన్నాయి. అవన్నీ ఈ మినహాయింపు ద్వారా ఇకపై ప్రయోజనం పొందొచ్చు.
- ముద్రా రుణాలు మంజూరు చేసే లిమిట్‌ను కేంద్ర ప్రభుత్వం డబుల్ చేసింది. ఇకపై గరిష్ఠంగా రూ.20 లక్షల దాకా ముద్రాలోన్‌ను మంజూరు చేయనున్నారు.
- ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ స్కీంను నిర్మల అనౌన్స్ చేశారు. ఇందులో భాగంగా ఆ కేటగిరీలోని సంస్థలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా టర్మ్ లోన్లను మంజూరు చేస్తారు.
- ఎంఎస్ఎంఈల ఆర్థిక స్థితిగతులను కచ్చితత్వంతో అంచనా వేసే సామర్థ్యాలను అందిపుచ్చుకునేలా ప్రభుత్వరంగ బ్యాంకులను తీర్చిదిద్దనున్నారు.
- ఇంతకుముందు ఎంఎస్ఎంఈలు ‘ట్రెడ్స్’(TReDs) పోర్టల్ ద్వారా ఏటా రూ.500 కోట్ల టర్నోవర్‌ను చేయాలనే టార్గెట్ ఉండేది. దీన్ని రూ.250 కోట్లకు తగ్గించారు.
- ఎంఎస్ఎంఈ క్లస్టర్ల పరిధిలో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బి) మరో 24 కొత్త బ్రాంచీలను తెరవనున్నారు.