Google – EC : ఎన్నికల వేళ ఈసీతో గూగుల్ జట్టు.. ఎందుకు ?
Google - EC : వారం రోజుల్లోగా మన దేశంలో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.
- Author : Pasha
Date : 12-03-2024 - 4:58 IST
Published By : Hashtagu Telugu Desk
Google – EC : వారం రోజుల్లోగా మన దేశంలో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు గూగుల్‌తో కేంద్ర ఎన్నికల సంఘం జట్టు కట్టింది. ఇందులో భాగంగా అఫీషియల్ సమాచారం మాత్రమే ప్రజల్లోకి వెళ్లేలా గూగుల్ చర్యలు చేపడుతుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో రూపొందించే వీడియోలకు ‘ఏఐ’ అనే లేబుల్ వేసింది. ఈవివరాలను గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది.
We’re now on WhatsApp. Click to Join
ఈసీతో గూగుల్.. ఏం చేస్తాయంటే ?
- ఓటరుగా పేరు ఎలా నమోదు చేసుకోవాలి? ఎలా ఓటు వేయాలి? వంటి సమాచారాన్ని సులువుగా ప్రజలకు చేరవేసేందుకు కూడా ఈసీకి గూగుల్(Google – EC) సహకరిస్తుంది. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ సమాచారం లభిస్తుంది.
- డీప్‌ఫేక్, మార్ఫింగ్ చేసే మీడియాను గూగుల్ కట్టడి చేయనుంది.యూట్యూబ్‌లోని ఏఐ ఫీచర్లతో క్రియేట్ చేసిన కంటెంట్‌కు లేబుల్ వేసే ప్రక్రియను గూగుల్ ఇప్పటికే ప్రారంభించింది.
- గూగుల్‌కు చెందిన ఏఐ జెమినిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అందులో ఎన్నికలకు సంబంధించిన సమాచారం ఇవ్వకుండా గూగుల్ ఆంక్షలు విధించింది.
- యూట్యూబ్, గూగుల్ సెర్చ్‌లో ఎన్నికలకు సంబంధించిన వార్తలు, సమాచారం కేవలం అధీకృత సంస్థలదే డిస్‌ప్లే అయ్యేలా గూగుల్ చర్యలు తీసుకోనుంది.
- ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసే తప్పుడు సమాచారం, హింసను ప్రేరేపించేవి, విద్వేష వ్యాఖ్యలకు కూడా గూగుల్ డౌన్ గ్రేడ్ చేయనుంది.
- పాలసీకి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌ను తొలగించేందుకు గానూ మనుషులతో పాటు మెషిన్ లెర్నింగ్‌ను కూడా ఆ సంస్థ వినియోగించనుంది.
- ఎన్నికలకు సంబంధించిన యాడ్స్ పైనా కఠిన నిబంధనలను గూగుల్ అమలు చేయనుంది.
Also Read : Bharat Shakti Exercise : గర్జించిన పోఖ్రాన్.. యుద్ధ విమానాలు, డ్రోన్లు, మిస్సైళ్లతో సందడి
గూగుల్ క్రోమ్‌లో వల్నరబిలిటీలు
మన దేశంలో డిజిటల్ యూజర్లు తరచుగా ఉపయోగించే యాప్స్‌లో అప్పుడప్పుడూ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ బయటపడుతుంటాయి. ఇటీవల కాలంలో గూగుల్ క్రోమ్ (Google Chrome)లో తరచుగా టెక్నికల్ వల్నరబిలిటీలు బయటపడుతున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లో కొన్ని తీవ్రమైన సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని భారతదేశ సైబర్ సెక్యూరిటీ టీమ్ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) తాజాగా యూజర్లను హెచ్చరించింది. గూగుల్ క్రోమ్ 122.0.6261.11/2 వెర్షన్ల కంటే ముందు రిలీజ్ వెర్షన్లలో ఈ సమస్యలను ఉన్నాయని సెర్ట్-ఇన్ స్పష్టం చేసింది. ఈ సమస్యల కారణంగా విండోస్, మ్యాక్ కంప్యూటర్లు వాడే యూజర్లు ప్రభావితం కానున్నారు. ఇవి చాలా తీవ్రమైనవి. వీటిని ఉపయోగించుకుని హ్యాకర్లు యూజర్ల కంప్యూటర్‌ను ఈజీగా యాక్సెస్ చేసే ప్రమాదం ఉంది. క్రోమ్‌లో భాగమైన ఫెడ్సీఎం (FedCM)లో సమస్య ఉన్నట్లు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది. అయితే ఈ సమస్యలకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గూగుల్ సరికొత్త ఫిక్స్‌లతో వీటిని పరిష్కరించింది. ఆ క్రోమ్ బ్రౌజర్ లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేయడం ద్వారా ప్రమాదాలను అడ్డుకోవచ్చని CERT-In చెబుతోంది.