Massage Centers : బంజారాహిల్స్ మసాజ్ సెంటర్ లో పాడుపనులు..బట్టబయలు చేసిన పోలీసులు
మసాజ్ సెంటర్ పేరుతో చాలామంది వ్యభిచారం నడిపిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు
- By Sudheer Published Date - 04:08 PM, Tue - 29 August 23

ఒకప్పుడు మసాజ్ సెంటర్ (Massage Center) అంటే విదేశాల్లో ఎక్కువగా ఉంటాయని మాట్లాడుకునేవారు..కానీ ఈ మధ్య ప్రతి నగరంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఈ మసాజ్ సెంటర్ పేరుతో చాలామంది వ్యభిచారం నడిపిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో ఇటీవల కాలంలో మసాజ్ సెంటర్లలో పెద్ద ఎత్తున వ్యభిచారం (Prostitution) నడుస్తున్నట్లు తేలింది. ఎప్పటికప్పుడు పోలీసులు ఈ మసాజ్ సెంటర్లపై నిఘా పెడుతున్నప్పటికీ..పోలిసుల కళ్లుగప్పి వ్యభిచారం సాగిస్తున్నారు. తాజాగా బంజారాహిల్స్ లో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు.
Read Also : Rudakota Mystery : మన్యం జిల్లాలో రహస్యం..గర్భం దాల్చాలంటేనే భయపడుతున్న మహిళలు
బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ‘హెవెన్ ఫ్యామిలీ స్పా’(Heaven Family SPA Center), ‘ది వెల్‌వెట్ స్పా’ (The Velvet Spa Center) సెంటర్ లలో గత కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతున్నట్లుగా పోలీసులకు (Police Raid) సమాచారం అందింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా ఆ సెంటర్ల ఫై దాడి చేయగా..పదుల సంఖ్యలో పట్టుబడ్డారు. వివిధ రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి మసాజ్ పేరుతో ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది. ఎస్‌ఐ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఈ రెండు కేంద్రాలపై దాడులు నిర్వహించారు. నిర్వాహకుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు తెలుస్తోంది. నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిమీద కేసులు నమోదు చేసి, 14మంది యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. వీరితో పాటు ఐదుగురు విటులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.