Canara Bank: కెనరా బ్యాంక్ వినియోగదారులకు శుభవార్త..!
ఏటీఎం (ATM)లో నగదు ఉపసంహరణతోపాటు, పీవోఎస్ (POS) చెల్లింపుల పరంగానూ పరిమితులు పెంచింది. ఈ నిర్ణయాలు తక్షణం అమల్లోకి.
- Author : Maheswara Rao Nadella
Date : 06-12-2022 - 3:18 IST
Published By : Hashtagu Telugu Desk
కెనరా బ్యాంక్ (Canara Bank) ఆదర్శనీయమైన నిర్ణయాలు తీసుకుంది. కస్టమర్లకు అనుకూలమైన చర్యలు తీసుకుంది. డెబిట్ కార్డులపై రోజువారీ లావాదేవీల పరిమితిని పెంచింది. ఏటీఎం (ATM) ల్లో నగదు ఉపసంహరణతోపాటు, పీవోఎస్ (POS) చెల్లింపుల పరంగానూ పరిమితులు పెంచింది. ఈ నిర్ణయాలు తక్షణం అమల్లోకి.
కెనరా బ్యాంక్ (Canara Bank) డెబిట్ కార్డుతో ఇప్పటి వరకు ఏటీఎం నుంచి రూ.40,000 వరకు నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. కానీ, ఇకపై ఇది రూ.75,000గా అమల్లో ఉంటుంది. డెబిట్ కార్డుతో పీవోఎస్ మెషిన్లు, ఈ కామర్స్ పోర్టళ్లలో ఒక రోజులో రూ. లక్ష వరకు చెల్లింపులు చేసే సౌకర్యం ఉండగా, దీన్ని రూ.2 లక్షలకు పెంచింది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ/కాంటాక్ట్ లెస్) చెల్లింపుల పరిమితి ఒక రోజులో రూ.25వేలుగా ఉంటే, ఇకమీదటా ఇదే పరిమితి కొనసాగుతుంది. క్లాసిక్ డెబిట్ కార్డులకు ఈ పరిమితులు అమలవుతాయి. ఇక ప్లాటినం, బిజినెస్, సెలక్ట్ డెబిట్ కార్డులతో ఒక రోజులో ఏటీఎం నుంచి రూ. లక్షను ఉపసంహరించుకోవచ్చు. పీవోఎస్/ఈ కామర్స్ చెల్లింపుల పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెరిగింది.
Also Read: Neura Link: ఎలాన్ మస్క్ ‘న్యూరా లింక్ ప్రయోగాల్లో జంతు మరణాలు