Atlas Cycles: అట్లాస్ సైకిల్స్ మాజీ చైర్మన్ సలీల్ కపూర్ ఆత్మహత్య
అట్లాస్ సైకిల్స్ మాజీ చైర్మన్ సలీల్ కపూర్ తన సర్వీస్ రివాల్వర్‌తో తలపై కాల్చుకున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్నది. ఘటన అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
- By Praveen Aluthuru Published Date - 07:31 PM, Tue - 3 September 24

Atlas Cycles: అట్లాస్ సైకిల్స్ మాజీ చైర్మన్ సలీల్ కపూర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. మంగళవారం ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ ప్రాంతంలోని తన ఇంట్లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం రోడ్‌లోని తన ఇంటిలోని పూజ గదికి సమీపంలో రక్తంతో తడిసిన స్థితిలో సలీల్ మృతదేహాన్ని అతని మేనేజర్ చూసి సమాచారం అందించారు.
పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం సలీల్ కపూర్ తన సర్వీస్ రివాల్వర్‌తో తలపై కాల్చుకున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్నది. ఘటన అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఘటనా స్థలం నుంచి ఫోరెన్సిక్, క్రైమ్ బృందాలను రప్పించి ఆధారాలు సేకరించారు. దక్షిణ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో 9 కోట్ల రూపాయల మోసం కేసులో ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) సలీల్ కపూర్‌ను అరెస్టు చేసింది. అతనిపై రెండు వేర్వేరు మోసాల కేసులు నమోదయ్యాయి. జనవరి 2020లో అతని కోడలు నటాషా కపూర్ కూడా అదే ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.సలీల్ సూసైడ్ నోట్‌లో తన కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోవాలని కోరాడు, అయితే ఆత్మహత్య వెనుక కారణాన్ని చెప్పలేదు.
Also Read: Game Changer : డిసెంబర్ 20 న గేమ్ ఛేంజర్..?