Game Changer : డిసెంబర్ 20 న గేమ్ ఛేంజర్..?
ఈ మూవీ ని డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాత దిల్ రాజు ఫిక్స్ అయినట్లు సమాచారం
- By Sudheer Published Date - 07:16 PM, Tue - 3 September 24
డైరెక్టర్ శంకర్ (Shankar) – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram CHaran) కలయికలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer). దిల్ రాజు నిర్మాణంలో పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ఫై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే షూటింగ్ ఆలస్యం అవుతుండడం..ప్రమోషన్ కార్యక్రమాలు పెద్దగా చేయకపోవడం తో ఫ్యాన్స్ మేకర్స్ ఫై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో వినాయకచవితి నుండి వరుసగా సినిమా తాలూకా అప్డేట్స్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఈ మూవీ ని డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాత దిల్ రాజు ఫిక్స్ అయినట్లు సమాచారం. వినాయక చవితి పండగ రోజున విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టక ముందే శంకర్ ‘భారతీయుడు 2’ సగం పూర్తి చేశారు. ‘గేమ్ ఛేంజర్’ మొదలైన కొద్ది నెలలకు మిగిలిన సినిమా కంప్లీట్ చేసేందుకు బ్రేక్ తీసుకున్నారు. అలా ‘గేమ్ ఛేంజర్’కు బ్రేక్ పడింది. ఆ తర్వాత కొన్ని ప్రత్యేక కారణాల రీత్యా సినిమా పూర్తి కావడానికి కాస్త ఆలస్యం అయింది. ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ మూవీ లో రామ్ చరణ్ డ్యుయెల్ రోల్లో కనిపించనున్నారని సమాచారం. ఇక చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ నటిస్తోంది. సీనియర్ డైరెక్టర్, నటుడు ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో సినిమా రూపొందుతుంది.
Read Also : Kashmir Elections : బీజేపీతో పొత్తుపై మెహబూబా ముఫ్తీ కీలక ప్రకటన
Related News
Game Changer : వినాయక చవితి స్పెషల్ గేమ్ ఛేంజర్ అప్డేట్.. కొత్త పోస్టర్ అదిరింది..
గేమ్ ఛేంజర్ సినిమా నుంచి రామ్ చరణ్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది.