Food Poisoning: పంజాబ్ లో ఫుడ్ ఫాయిజన్, 18 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
- By Balu J Published Date - 04:36 PM, Sat - 2 December 23
Food Poisoning: పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 18 మంది విద్యార్థులు హాస్టల్ మెస్‌లో భోజనం చేసిన తర్వాత కడుపునొప్పి, వాంతులతో ఇబ్బందులు పడ్డారు. దీంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు శనివారం తెలిపారు. ఫుడ్ కాంట్రాక్టర్‌ను అరెస్టు చేశామని, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం) విచారణకు ఆదేశించామని విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ తెలిపారు.
18 మంది విద్యార్థులను సివిల్ ఆసుపత్రికి తీసుకువచ్చామని, వారిలో 14 మంది డిశ్చార్జ్ అయ్యారని సంగ్రూర్ డిప్యూటీ కమిషనర్ జితేంద్ర జోర్వాల్ శనివారం తెలిపారు. శనివారం మరో 36 మంది విద్యార్థులను సివిల్ ఆసుపత్రికి తరలించామని, వారందరూ నిలకడగా ఉన్నారని తెలిపారు. ఆసుపత్రిలో ఎటువంటి లూజ్ మోషన్ లేదా వాంతులతో బాధపడలేదు. దీనిపై విచారణకు ఎస్‌డీఎం అధ్యక్షతన విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు డీసీ తెలిపారు.