Murder Case : రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై యువకుడి హత్య కేసులో ఐదుగురు అరెస్ట్
బిజ్వాసన్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం 1పై జరిగిన హత్య కేసులో ఢిల్లీ పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన 48
- By Prasad Published Date - 08:50 AM, Thu - 4 May 23

బిజ్వాసన్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం 1పై జరిగిన హత్య కేసులో ఢిల్లీ పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన 48 గంటల్లోనే బాలనేరస్తుడు సహా నిందితులందరినీ ఢిల్లీ కాంట్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరైన ఫైజాన్ బాధితుడిని కొట్టాడంతో ఆ తర్వాత అతడు కుప్పకూలిపోయాడు. ఐదుగురు నిందితులు, మరణించిన బాధితుడు మే 1 న స్టేషన్‌లో గొడవకు దిగారు.
బాధితుడు పిడికిలి దెబ్బల వల్ల అంతర్గత గాయాలు అవ్వడంతో మరణించాడు. హత్య జరిగిన కొద్దిసేపటికే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బిజ్వాసన్‌వాస్‌లో నివాసం ఉంటున్న నిందితుడు మనీష్‌కుమార్‌ను అదే రోజు అరెస్టు చేశారు. కస్టడీలో, కేసులో ఉన్న ఇతర నిందితుల గుర్తింపులను అతను అంగీకరించాడు. తదనంతరం, పోలీసుల బృందాలు గురుగ్రామ్‌లోని కొన్ని ప్రాంతాలతో సహా స్థానాలపై దాడి చేసి ఓ మైనర్ బాలుడితో సహా మరో నలుగురు నిందితులు పట్టుకున్నారు.