Gang Rape: మహిళపై సామూహిక అత్యాచారం.. ఐదుగురిపై కేసు నమోదు..!
31 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసిన ఆరోపణలపై బొటాడ్ పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు శుక్రవారం తెలిపారు.
- By Gopichand Published Date - 12:46 PM, Fri - 28 October 22

31 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసిన ఆరోపణలపై బొటాడ్ పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు శుక్రవారం తెలిపారు. మహిళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. నిందితులు అక్టోబర్ 26 రాత్రి మహిళను నిర్బంధించి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు. అక్టోబరు 26న మహిళా ఓ పని కోసం ఆటోను అద్దెకు తీసుకున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఇద్రీష్ సంధి, సవ్లత్ సంధి, సాహిల్ సంధి కలిసి ఆమెను బలవంతంగా ఒక పాడుబడిన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళకు వివాహమైంది. కానీ అనారోగ్య కారణాల వల్ల ఆమె బోటాడ్ పట్టణానికి సమీపంలోని లాతిదాద్ గ్రామంలోని తన తల్లిదండ్రుల ఇంటి వద్ద ఉంటుంది. బాధిత మహిళ డిప్రెషన్, ఇతర మానసిక సమస్యల నుంచి బయటపడటానికి చికిత్స పొందుతోంది. గురువారం నాడు బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు కేసు దర్యాప్తు చేస్తున్న స్థానిక క్రైం బ్రాంచ్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎస్‌బి సోలంకి తెలిపారు. సామూహిక అత్యాచారం, లైంగిక వేధింపుల ప్రేరేపణకు పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్టు చేయడానికి గాలింపు చర్యలు ప్రారంభించినట్లు సబ్ ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు.
.