2 Terrorists Killed: జమ్మూ కాశ్మీర్ లో కాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
- By Balu J Published Date - 04:27 PM, Wed - 3 May 23

జమ్మూ కాశ్మీర్‌లో (Jammu and Kashmir) ని కుప్వారా జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా పిచ్నాడ్ మచిల్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ (Encounter) జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. “ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది ”అని అధికారి తెలిపారు. హతమైన ఉగ్రవాదుల (Terrorists) గురించి సమగ్రంగా తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారి తెలిపారు.
ఈ ఏడాది మార్చిలో పుల్వామాలోని మిత్రిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. అదేవిధంగా ఫిబ్రవరిలో, పుల్వామా జిల్లాలోని స్థానిక మార్కెట్‌కు వెళుతున్న కాశ్మీరీ పండిట్ (సంజయ్ శర్మ)పై ఉగ్రవాదులు కాల్పులు (Firing) జరిపారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.
Also Read: Elephant Video: ఏనుగును టీజ్ చేసిన మహిళ.. తొండంతో కొడితే దిమ్మతిరిగింది!