Bharat Jodo Yatra: ముగింపు దశకు భారత్ జోడో యాత్ర.. రేపు శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ
సోమవారం జరిగే భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ముగింపు కార్యక్రమానికి 12 ప్రతిపక్ష పార్టీలు హాజరు కానున్నాయి. ఈ కార్యక్రమానికి 21 పార్టీలను ఆహ్వానించామని, అయితే భద్రతా కారణాల వల్ల కొందరు హాజరుకావడం లేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
- By Gopichand Published Date - 10:55 AM, Sun - 29 January 23

సోమవారం జరిగే భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ముగింపు కార్యక్రమానికి 12 ప్రతిపక్ష పార్టీలు హాజరు కానున్నాయి. ఈ కార్యక్రమానికి 21 పార్టీలను ఆహ్వానించామని, అయితే భద్రతా కారణాల వల్ల కొందరు హాజరుకావడం లేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, టీడీపీ పార్టీలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి.
ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే), శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ), తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ), నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్), ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, సీపీఐ(ఎం), సీపీఐ , విడుతలై చిరుతైగల్ కట్చి (VCK), కేరళ కాంగ్రెస్, ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, మెహబూబా ముఫ్తీ జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP), షిబు సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) పార్టీల లీడర్లు శ్రీనగర్‌లో జరిగే భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమానికి హాజరు కానున్నారు.
Also Read: Ram Charan: రామ్‌చరణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మా నాన్నగారు క్వైట్‌గా ఉంటారేమో.. మేము కాదు.!
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లో పాదయాత్ర చేస్తున్న రాహుల్.. ఆదివారం శ్రీనగర్ లోని పంతా చౌక్ నుంచి నెహ్రూ పార్క్ వరకు నడుస్తారు. అక్కడితో యాత్ర ముగుస్తుంది. యాత్ర ముగింపు సందర్భంగా సోమవారం శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా భారత్ జోడో యాత్రను గతేడాది సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 145 రోజుల పాటు 3,970 కిలోమీటర్లు నడిచారు.

Related News

Revanth Offer to Rahul : రాహుల్ కు రేవంత్ బంపర్ ఆఫర్
రాహుల్ గాంధీకి రేవంత్ బంపర్ ఆఫర్ (Revanth Offer to Rahul) ఇవ్వడం ఏమిటి?