Father and daughter duo create history : దేశచరిత్రలోనే తొలిసారి…ఫైటర్ జెట్ నడిపిన తండ్రీకూతురు..!!
భారత వైమానిక దళ చరిత్రలో తండ్రీకూతురు అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. ఎయిర్ కమొడోర్ సంజయ్ శర్మ ఆయన కుమార్తు అనన్య శర్మకలిసి ఫైటర్ జెట్ నడిపి చరిత్ర స్రుష్టించారు.
- By hashtagu Published Date - 01:24 PM, Wed - 6 July 22
భారత వైమానిక దళ చరిత్రలో తండ్రీకూతురు అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. ఎయిర్ కమొడోర్ సంజయ్ శర్మ ఆయన కుమార్తు అనన్య శర్మకలిసి ఫైటర్ జెట్ నడిపి చరిత్ర స్రుష్టించారు. యుద్ధ విమానాన్ని నడిపిన మొదటి తండ్రికూతురుగా నిలిచారు. ఆ ఇద్దరూ కలిసి ఫైటర్ జెట్ ముందు ఫోజులిస్తున్న ఓ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.
1989లో వైమానిక దళంలో చేరిన తన తండ్రి సంచ్ శర్మ అడుగుజాడల్లోనే నడించింది అనన్యశర్మ. తానుకూడా సైన్యంలో చేరి దేశానికి సేవలందించాలని నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో బీటెక్ పూర్తి చేసిన అనన్య వైమానిక దళంలో మొదటి మహిళా ఫైటర్ పైలెట్ల బృందంలో చోటు దక్కించుకుంది. ఆ తర్వాత ఫ్లయింగ్ బ్రాంచ్ శిక్షణకు సెలక్ట్ అయ్యింది.
కఠిన శిక్షణ పొందిన అనన్య గతేడాది డిసెంబర్లో ఫైటర్ పైలెట్ గా నియామకం పొందింది. మే 30న కర్నాటకలోని బీదర్ లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో హాక్ -132 ఎయిర్ క్రాప్ట్ లో తండ్రీ కూతురు ప్రయాణించి హిస్టరీ క్రియేట్ చేశారు. ఓ మిషన్ కోసం ఇలా తండ్రి కుమార్తే ఒకే యుద్ధ విమానంలో కలిసి ప్రయాణం చేయడం ఇదే మొదటిసారని వైమానిక దళం వెల్లడించింది. తండ్రి సంజయ్ తో కలిసి ఒక యుద్ధ విమానంలో ప్రయాణించడంతో అనన్య కల సాకారం అయ్యింది. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.