HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Family Status For Live In Couples Digital Census

Family Status: సహజీవన జంటలకు కుటుంబ హోదా.. డిజిటల్ గా జనాభా లెక్కలు..

  • Author : Vamsi Chowdary Korata Date : 30-03-2026 - 3:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Census 2027
Census 2027

దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదిస్తూ.. దేశవ్యాప్తంగా 16వ జనాభా గణనకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఈ భారీ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. మారుతున్న సామాజిక మార్పులకు అనుగుణంగా కేంద్రం షాకింగ్ నిర్ణయాలు తీసుకుంది. ఈసారి డిజిటల్ పద్ధతిలో సాగే ఈ గణనలో.. తొలిసారిగా సహజీవన జంటలకు కూడా అధికారికంగా కుటుంబ హోదా కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. కేవలం అధికారులే కాకుండా పౌరులు కూడా తమ వివరాలను తామే స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటును కూడా కల్పించింది.

దేశవ్యాప్తంగా అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 16వ జనాభా గణన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రారంభం అవుతున్న ఈ భారీ కసరత్తులో కేంద్రం కీలక మార్పులు చేపట్టింది. ముఖ్యంగా సామాజిక మార్పులకు అనుగుణంగా ఇకపై సహజీవన జంటలను కూడా ఒకే కుటుంబంగా గుర్తించాలని నిర్ణయించింది. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ సోమవారం జనగణన విధివిధానాలను వెల్లడించారు.

రెండు దశల్లో జనగణన ప్రక్రియ..

ఈసారి జనగణనను పూర్తి స్థాయిలో డిజిటల్ పద్ధతిలో, అది కూడా రెండు దశల్లో నిర్వహించనున్నారు. తొలి దశ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా, ఈ దశలో గృహ గణన చేపడతారు. అధికారులు మొబైల్ యాప్‌తో ప్రతి ఇంటికీ వెళ్లి నివాస వివరాలను సేకరిస్తారు. ఈ దశలోనే అసలైన జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. ముఖ్యంగా వ్యక్తుల సంఖ్య, వయస్సు, విద్య వంటి వివరాలను ఈ సందర్భంగానే నమోదు చేస్తారు. అయితే, ఈసారి ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటును కూడా కేంద్రం కల్పించింది. తద్వారా పౌరులు తమ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నేరుగా పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు.

ప్రశ్నావళిలో ఏమేమి ఉన్నాయంటే..?

జనగణన కోసం మొత్తం 33 అంశాలతో కూడిన ప్రత్యేక ప్రశ్నావళిని రూపొందించారు. ఇందులో ప్రధానంగా ఇంటి యజమాని పేరు, కులం, కమ్యూనిటీ, కుటుంబ సభ్యుల సంఖ్యకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అలాగే తాగునీటి వనరులు, మరుగుదొడ్ల వినియోగం, వంటగది సౌకర్యాలు, వంటకు వాడే ఇంధనం, ఇంటర్నెట్, ఫోన్లు, వాహనాలు (సైకిల్ నుంచి కారు వరకు), రేడియో, టీవీ వంటి గృహోపకరణాల గురించి కూడా ఆరా తీస్తారు. అంతేకాకుండా తృణధాన్యాల వినియోగంపై కూడా ఈసారి ప్రశ్నించనున్నారు.

15 ఏళ్ల తర్వాత గణన

సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి జరగాల్సిన జనగణన.. చివరిసారిగా 2011లో జరిగింది. 2021లో జరగాల్సిన ప్రక్రియ కొవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఎట్టకేలకు దేశ జనాభా స్థితిగతులపై స్పష్టమైన లెక్కలు తేలనున్నాయి. దేశ భవిష్యత్తు ప్రణాళికలు, సంక్షేమ పథకాల రూపకల్పనకు ఈ గణాంకాలు అత్యంత కీలకం కానున్నాయి. ఇదీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Census 2027
  • Census of India
  • central government
  • Digital Census
  • Family Status
  • Household Listing
  • India Caste Census
  • Indian Census
  • Indian Demographics
  • Live in Couples
  • Live In Relationships
  • Mrityunjay Kumar Narayan
  • NPR
  • Population Enumeration
  • Registrar General of India
  • Self Enumeration

Related News

Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మరో కీలక ప్రాజెక్టును కేటాయించింది. రాష్ట్రానికి ఎన్‌సీసీ (నేషనల్ కాడెట్ కార్ప్స్) డైరెక్టరేట్‌ను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్‌సీసీ హెడ్‌క్వార్టర్స్ డైరెక్టరేట్ జనరల్ ప్రకటన విడుదల చేసింది. ఏపీతో పాటుగా జార్ఖండ్‌కు కూడా డైరెక్టరేట్‌ను మంజూరు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 17 డైరెక్టరేట్లు ఉండగా.. తాజాగా ఏపీ, జార్ఖండ్‌

  • Centre's sensational decision on petrol 30% excise duty waiver.

    Fuel Price: పెట్రోల్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. 30 శాతం ఎక్సైజ్ సుంకం మినహాయింపు

Latest News

  • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

  • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

  • Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • 48 ఏళ్ల తర్వాత ఒక్కటైన జంట.. టాటూనే సాక్ష్యం

  • Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd