Arvind Kejriwal : మే7 వరకు కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
- Author : Latha Suma
Date : 23-04-2024 - 4:02 IST
Published By : Hashtagu Telugu Desk
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 14 రోజుల పాటుల పాటు జ్యుడిషియల్ కస్టడీ(Judicial Custody)ని రౌస్ అవెన్యూ కోర్టు ఈరోజు పొడిగించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి చెందిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్(Kejriwal) తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. తన అరెస్టును ఖండిస్తు..సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. ఈపిటిషన్‌పై ఈ నెల 15న విచారణ జరిపిన ధర్మాసనం అరెస్టు అంశంపై ఈడీ వివరణ కోరింది. ఈడీ వివరణ ఇంకా పెండింగ్‌లో ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు కేజ్రీవాల్‌తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న బీఆర్ఎస్ నేత కె.కవిత, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున గోవా ఎన్నికల్లో ఫండ్ మేనేజర్‌గా వ్యవహరించిన చంద్రప్రీత్ సింగ్ జ్యుడిషయల్ కస్టడీని కూడా మే 7 వరకూ కోర్టు పొడిగించింది. మంగళవారంతో ఈ ముగ్గురి కస్టడీ ముగియడంతో వీరిని వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. మరో 14 రోజులు కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు సంస్థలు కోరడంతో కోర్టు అనుమతించింది.
Read Also: Lok Sabha Election Campaign : కేసీఆర్ ప్రచార రథానికి ప్రత్యేక పూజలు..
కాగా, జైలులో కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ పెరగడంతో ఆయనకు సోమవారం సాయంత్రం స్వల్ప మోతాదులో ఇన్సులెన్ ఇచ్చారు. దీనికి ముందు తన భార్య సునితా కేజ్రీవాల్ సమక్షంలో ప్రతిరోజూ 15 నిమిషాల పాటు మెడికల్ కన్సల్టేషన్‌కు అనుమతించాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అయితే, ప్రత్యేక కన్సల్టేషన్ అవసరమైతే ఎయిమ్స్ డైరెక్టర్ ఆధ్వర్యంలో మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి వైద్య చికిత్స కల్పించాలని తీహార్ జైలు అధికారులను ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఒంట్లో చక్కెర స్థాయి పెరగడంతో ఆయనకు స్వల్ప మోతాదులో వైద్యులు ఇన్సులెన్ ఇచ్చారు. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. హనుమాన్ జయంతి సందర్భంగా తమకు ఈ వార్త ఎంతో ఆనందం కలిగించదని, ఇదంతా భగవంతుని ఈశీస్సుల ఫలితమేనని ప్రకటించింది. ఎయిమ్స్ వైద్యుల సూచన మేరకు కేజ్రీవాల్‌కు లో-డోస్ ఇన్సులెన్ రెండు యూనిట్లు ఇచ్చినట్టు తీహార్ జైలు అధికారులు వెల్లడించారు.