Electoral Dataset : లోక్‌సభ పోల్స్ డేటాసెట్ రిలీజ్ చేసిన ఈసీ.. అందులో ఏముందంటే..
పారదర్శకత, పరిశోధన లక్ష్యంగా మొత్తం 100 గణాంకాలను విడుదల చేశామని.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల డేటా సెట్(Electoral Dataset)గా నిలుస్తుందని ఈసీ వెల్లడించింది.
- Author : Pasha
Date : 26-12-2024 - 6:34 IST
Published By : Hashtagu Telugu Desk
Electoral Dataset : లోక్‌సభ ఎన్నికల డేటా సెట్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గురువారం విడుదల చేసింది.ఈ డేటా సెట్‌లో 42 గణాంక నివేదికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై 14 నివేదికలు ఉన్నాయి. పారదర్శకత, పరిశోధన లక్ష్యంగా మొత్తం 100 గణాంకాలను విడుదల చేశామని.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల డేటా సెట్(Electoral Dataset)గా నిలుస్తుందని ఈసీ వెల్లడించింది.
Also Read :Bal Puraskars : ఏపీ బాలిక జెస్సీకి రాష్ట్రీయ బాల పురస్కార్.. మరో 16 మందికి కూడా..
లోక్‌సభ ఎన్నికల డేటాసెట్‌లో..
2024 లోక్‌సభ ఎన్నికల డేటాసెట్‌లో పార్లమెంటరీ నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, రాష్ట్రాల వారీగా ఎన్నికల అధికారులు, పోలింగ్ స్టేషన్ల సంఖ్య, రాష్ట్రం వారీగా/ పార్లమెంటరీ నియోజకవర్గం వారీగా ఓటింగ్ శాతం, పార్టీల వారీగా ఓట్ల వాటా, లింగ ఆధారిత ఓటింగ్ వివరాలు, రాష్ట్రాల వారీగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం, ప్రాంతీయ వైవిధ్యాలు, నియోజకవర్గాల డేటా, జాతీయ, ప్రాంతీయ / గుర్తింపు పొందని స్వతంత్ర పార్టీల పనితీరు, గెలిచిన అభ్యర్థుల విశ్లేషణ, నియోజకవర్గం వారీగా ఫలితాలు సహా ఇతర అంశాలన్నీ ఈ డేటాసెట్‌లో ఉంటాయని ఈసీ పేర్కొంది.
Also Read :CWC Meeting : సోనియాగాంధీకి అస్వస్థత.. సీడబ్ల్యూసీ భేటీకి దూరం
డేటాసెట్‌లోని కీలక గణాంకాలివీ..
- గత లోక్‌సభ ఎన్నికల్లో 64.64 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకొని ప్రపంచ రికార్డు సృష్టించారని ఈసీ తెలిపింది.
- లోక్‌సభ ఎన్నికల కోసం దాఖలైన నామినేషన్ల సంఖ్య 2024లో 12,459 కాగా.. 2019లో వాటి సంఖ్య 11,692 అని తెలిపింది.
- 2024లో లోక్‌సభ పోల్స్‌లో 8,360 మంది అభ్యర్థులు పోటీపడగా.. 2019లో ఆ సంఖ్య 8,054గా ఉందని ఈసీ చెప్పింది.
- లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరిగిందని ఈసీ నివేదిక తెలిపింది. పురుష ఓటర్లు 65.55 శాతం ఉండగా, మహిళా ఓటర్లు 65.78 శాతం ఉన్నారని చెప్పింది.
- 2019లో లోక్‌సభ ఎన్నికల్లో 726 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా.. 2024లో ఆ సంఖ్య 800 మందికి చేరిందని తెలిపింది.
- 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే 2024లో ట్రాన్స్‌జెండర్ల ఓటర్ల సంఖ్య 46.4 శాతం పెరిగిందని ఈసీ చెప్పింది.
- 2019లో 61,67,482 మంది విభిన్న ప్రతిభావంతులు ఓటింగ్ కోసం నమోదు చేసుకోగా, 2024లో ఆసంఖ్య 90 లక్షలకు చేరిందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
- 2019లో 540 పోలింగ్ స్టేషన్‌లలో రీపోలింగ్ జరగగా.. 2024లో 40 పోలింగ్ స్టేషన్‌లలోనే రీపోలింగ్ జరిగిందని చెప్పింది.