Delhi Liquor Scam: సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు 8వ సారి ఈడీ సమన్లు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రికి ఈడీ ఇప్పటివరకు 7 సార్లు సమన్లు పంపగా నేడు ఎనిమిదో సారి ఆయనకు సమన్లు పంపింది.
- By Praveen Aluthuru Published Date - 03:43 PM, Tue - 27 February 24

Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రికి ఈడీ ఇప్పటివరకు 7 సార్లు సమన్లు పంపగా నేడు ఎనిమిదో సారి ఆయనకు సమన్లు పంపింది. అంతకుముందు ఈడీ పంపిన 7సార్లు నోటీసుల్ని అరవింద్ కేజ్రీవాల్ ఏ మాత్రం పట్టించుకోలేదు.
మంగళవారం ఈడీ మరోసారి అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు పంపింది. లిక్కర్ పాలసీకి సంబంధించిన వ్యవహారంలో మార్చి 4న విచారణకు పిలిచింది. విశేషమేమిటంటే ఢిల్లీ ముఖ్యమంత్రి సోమవారం అంటే ఫిబ్రవరి 26న ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈడీ సమన్లపై స్పందించిన ఆప్ ఈ అంశం కోర్టులో ఉందని, తదుపరి విచారణ మార్చి 16న ఉందని, ఇంకా ఈడీ సమన్లు పంపుతోందని తెలిపింది. ప్రతిరోజూ సమన్లు పంపే బదులు ఈడీ కోర్టు నిర్ణయం కోసం వేచి ఉండాలని ఆప్ పేర్కొంది.
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈడీ జారీ చేస్తున్న నోటీసుల్ని అక్రమమని కొట్టిపారేస్తున్నారు. ఈ సమన్లు రాజకీయ ప్రేరేపితమని ఆయన అభివర్ణించారు. ఈడీ చర్య వెనుక ఉన్న ఉద్దేశాన్ని కూడా కేజ్రీవాల్ పలు మార్లు లేవనెత్తారు. కాగా అరవింద్ కేజ్రీవాల్ ఈడీ సమన్లను పదేపదే పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించింది. దీనిపై మార్చి 16న హాజరు కావాలని ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్‌ను ఆదేశించింది. ఇదిలా ఉంటే ఈ కేసులో సిబిఐ తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ చేసింది. ఆమె కూడా షెడ్యూల్ ని చూపి విచారణకు హాజరవ్వలేదు.
Also Read: Patanjali Ads : ‘‘ఎంత ధైర్యం.. వద్దన్నా తప్పుడు యాడ్సే ఇస్తారా?’’ పతంజలికి సుప్రీం చివాట్లు