ED Arrest: అక్రమ మైనింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్
అక్రమ మైనింగ్ ఆరోపణలపై జనవరిలో ఎమ్మెల్యే సురేంద్ర పన్వార్ నివాసం, కార్యాలయం సహా పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసింది. పన్వార్‌తో పాటు, అక్రమ మైనింగ్ కేసులో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డి) మాజీ ఎమ్మెల్యే దిల్‌బాగ్ సింగ్‌కు సంబంధించిన స్థలాలపై జనవరిలో ఈడీ దాడులు చేసింది
- By Praveen Aluthuru Published Date - 01:17 PM, Sat - 20 July 24

ED Arrest: మైనింగ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. గత కొంత కాలంగా పలువురు ప్రజాప్రతినిధులు అక్రమ మైనింగ్ కేసులో పట్టుబడ్డారు. వ్యాపారంలో అవకతవకలు కాకుండా మనీలాండరింగ్ కూడా జరుగుతున్నట్లు ఈడీ గుర్తించింది. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఈడీ షాక్ ఇచ్చింది.
అక్రమ మైనింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యాడు. దర్యాప్తులో భాగంగా ఈడీ చర్యలు తీసుకుంది. ఈ కేసులో హర్యానాలోని సోనిపట్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేంద్ర పన్వార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. గురుగ్రామ్‌లో అతడిని అదుపులోకి తీసుకుంది.
అక్రమ మైనింగ్ ఆరోపణలపై జనవరిలో ఎమ్మెల్యే సురేంద్ర పన్వార్ నివాసం, కార్యాలయం సహా పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసింది. పన్వార్‌తో పాటు, అక్రమ మైనింగ్ కేసులో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డి) మాజీ ఎమ్మెల్యే దిల్‌బాగ్ సింగ్‌కు సంబంధించిన స్థలాలపై జనవరిలో ఈడీ దాడులు చేసింది. ఈ దాడిలో రూ.5 కోట్ల నగదు, విదేశీ ఆయుధాలు మరియు 300 కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకుంది.పన్వార్ మరియు దిల్‌బాగ్ సింగ్ ఇద్దరూ మైనింగ్ వ్యాపారంతో సంబంధం కలిగి ఉన్నారు. యమునానగర్, సోనిపట్, మొహాలీ, ఫరీదాబాద్, చండీగఢ్, కర్నాల్‌లలో ఇద్దరు నేతలు, వారి సన్నిహితులతో సంబంధం ఉన్న 20 చోట్ల సోదాలు జరిగాయి.
వాస్తవానికి ఈ కేసులో హర్యానా పోలీసులు తొలుత కేసు నమోదు చేశారు. విచారణలో మనీలాండరింగ్ కేసు వెలుగులోకి వచ్చింది.దీంతో రంగంలోకి దిగింది. ఈ రోజు సురేంద్ర పన్వార్‌ను అరెస్టు చేసేందుకు ఈడీ కేంద్ర పారామిలటరీ బలగాలతో గురుగ్రామ్ చేరుకుంది. 2019 అసెంబ్లీ ఎన్నికలలో పన్వార్ సోనిపట్ నుండి పోటీ చేసి బిజెపికి చెందిన కవితా జైన్‌ను 32,000 ఓట్ల తేడాతో ఓడించగా, ఐఎన్‌ఎల్‌డికి చెందిన దిల్‌బాగ్ సింగ్ యమునానగర్‌లో బిజెపికి చెందిన ఘనశ్యామ్ దాస్ చేతిలో 1,400 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు.
Also Read; UPSC Chairman : యూపీఎస్సీ ఛైర్మన్ అనూహ్య రాజీనామా.. కారణం అదేనా ?