Digvijaya Singh: ప్రధానిని నిర్ణయించేది ఈవీఎం సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలర్లే..
ఎలక్షన్ కమిషన్ హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్. ఈ రోజు బుధవారం భోపాల్‌లో ఈవీఎం మరియు వీవీప్యాట్‌లపై విలేకరుల సమావేశం సంచలన ఆరోపణలకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల సంఘాన్ని కూడా టార్గెట్ చేశారు.
- By Praveen Aluthuru Published Date - 03:37 PM, Wed - 24 January 24

Digvijaya Singh: ఎలక్షన్ కమిషన్ హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్. ఈ రోజు బుధవారం భోపాల్‌లో ఈవీఎం మరియు వీవీప్యాట్‌లపై విలేకరుల సమావేశం సంచలన ఆరోపణలకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల సంఘాన్ని కూడా టార్గెట్ చేశారు.
భారత ఎన్నికల ప్రక్రియలో ఈవీఎం యంత్రాల విశ్వసనీయతకు సంబంధించి ప్రశ్నలు నిరంతరం తలెత్తుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ మరోసారి ఈవీఎంలకు వ్యతిరేకంగా తెరతీసింది. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ బుధవారం భోపాల్‌లో ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల సంఘాన్ని కూడా టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించారు.
డిగ్గీ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ వద్ద ఎటువంటి సాంకేతిక బృందం లేదు. వారే ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. ఇదంతా పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది. ప్రైవేట్ వ్యక్తులు దేశంలో లేదా విదేశాల్లో ఉండవచ్చు. సాఫ్ట్‌వేర్‌ను ఎవరు ఇన్‌స్టాల్ చేస్తున్నారో క్లారిటీ లేదని ఆయన అన్నారు. సాఫ్ట్‌వేర్ మన ఓటును మార్చగలిగినప్పుడు లేదా ప్రభావితం చేయగలిగినప్పుడు, ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలనేది సాఫ్ట్‌వేర్ నిర్ణయిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సాఫ్ట్‌వేర్ ఓటర్ కాదని డిగ్గీ చెప్పారు.
దేశంలోని 90 కోట్ల మందికి పైగా ఓటర్ల భవితవ్యాన్ని కొందరు సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లకు అప్పగిస్తే సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసే వ్యక్తి లేదా సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో నిర్ణయిస్తారని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఎన్నికల ప్రక్రియకు ఓటర్లు లేదా రిటర్నింగ్ అధికారి, ECI యజమాని కాదని ఆయన అన్నారు. సాఫ్ట్‌వేర్ డెవలపర్ మరియు ఇన్‌స్టాలర్లే యజమానులని మండిపడ్డారు.
Also Read: Redmi 13C Offer: రెడ్ మీ ఫోన్ పై బంపర్ ఆఫర్.. కేవలం రూ.9వేలకే సొంతం చేసుకోండిలా?