NDA Vs INDIA : ఎన్డీఏతో ఇండియా ఢీ.. ఆ “ఆర్డినెన్స్” బిల్లు ఇవాళ రాజ్యసభ ముందుకు
NDA Vs INDIA : ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్రం జారీచేసిన ఢిల్లీ ఆర్డినెన్స్ కు సంబంధించిన బిల్లు సోమవారం రాజ్యసభ ముందుకు రానుంది.
- Author : Pasha
Date : 07-08-2023 - 7:24 IST
Published By : Hashtagu Telugu Desk
NDA Vs INDIA : ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్రం జారీచేసిన ఢిల్లీ ఆర్డినెన్స్ కు సంబంధించిన బిల్లు ఈరోజు (సోమవారం) రాజ్యసభ ముందుకు రానుంది.
ఇప్పటికే లోక్ సభ ఆమోదాన్ని పొందిన ఈ బిల్లును కనీసం రాజ్యసభలోనైనా అడ్డుకోవాలని విపక్ష కూటమి “ఇండియా” భావిస్తోంది.
ఈక్రమంలో ఇప్పటికే కూటమిలోని పార్టీలన్నీ సోమ, మంగళవారాల్లో రాజ్యసభలో అందుబాటులో ఉండాలని తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి.
Also read : Moon Images-Chandrayaan3 : మన “చంద్రయాన్” పంపిన చందమామ వీడియో
ఢిల్లీ ఆర్డినెన్స్ పై కేజ్రీవాల్ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు వాదనలు వినిపించిన అభిషేక్ మను సింఘ్వీయే .. రాజ్యసభ సభ్యుడి హోదాలో ప్రతిపక్షం తరఫున సోమవారం చర్చను ప్రారంభించే అవకాశం ఉంది. వాస్తవానికి ఎన్డీఏ కూటమి, విపక్ష పార్టీలకు రాజ్యసభలో సరిసమానమైన సంఖ్యలో ఎంపీలు(NDA Vs INDIA) ఉన్నారు. అయితే విపక్ష పార్టీలు వైఎస్సార్ సీపీ, బిజూ జనతాదళ్ లు ఎన్డీఏ కూటమి వైపు నిలుస్తామని తేల్చి చెప్పడంతో రాజ్యసభలోనూ ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు పాస్ అయ్యేందుకు లైన్ క్లియర్ అయింది.