Moon Images-Chandrayaan3 : మన “చంద్రయాన్” పంపిన చందమామ వీడియో
Moon Images-Chandrayaan3 : చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత కొన్ని వీడియోలు తీసి పంపింది.
- By Pasha Published Date - 07:08 AM, Mon - 7 August 23
Moon Images-Chandrayaan3 : చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత కొన్ని వీడియోలు తీసి పంపింది.
ఆ వీడియోల్లో చంద్రుడి ఉపరితలం దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వాటిని చూస్తుంటే.. మనం ఏదో బస్సులోనో, ట్రైన్ లోనో జర్నీ చేస్తూ చంద్రుడిని చూస్తున్నామా అనిపిస్తోంది!!
తాజాగా ఆ వీడియో ఫుటేజీని ఇస్రో ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేసింది.
The Moon, as viewed by #Chandrayaan3 spacecraft during Lunar Orbit Insertion (LOI) on August 5, 2023.#ISRO pic.twitter.com/xQtVyLTu0c
— LVM3-M4/CHANDRAYAAN-3 MISSION (@chandrayaan_3) August 6, 2023
ఆగస్టు 5న చంద్రుని కక్ష్యలోకి ఎంటర్ కాగానే.. ఈ వీడియోను చంద్రయాన్-3 అంతరిక్ష నౌక తీసిందని ఇస్రో వెల్లడించింది.
చంద్రయాన్-3 మిషన్ ఇప్పటివరకు సజావుగా సాగుతోందని, అంతరిక్ష నౌకలో ఉన్న “విక్రమ్” ల్యాండర్ ఆగస్టు 23న చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తుందని ఇస్రో అంచనా వేసింది.
చంద్రయాన్-3 ప్రాజెక్ట్ వ్యయం రూ.600 కోట్లు అని ఇస్రో(Moon Images-Chandrayaan3) వెల్లడించింది.
Tags
Related News
ISRO : ఇస్రోకి ప్రతిష్ఠాత్మక అవార్డు..!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan-3) మిషన్ సాధించిన విజయాలకు ఏవియేషన్ వీక్ లారియేట్స్ అవార్డు (Laureate Award) వరించింది.