CM Kejriwal: ఢిల్లీ కోర్టులో కేజ్రీవాల్ కు భారీ ఊరట
కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ ఆప్ మాజీ ఎమ్మెల్యే సందీప్‌కుమార్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో పాటు పిటిషనర్‌కు జరిమానా విధించాలని కోర్టు పేర్కొంది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించినట్టయ్యింది.
- By Praveen Aluthuru Published Date - 02:07 PM, Mon - 8 April 24

CM Kejriwal: కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ ఆప్ మాజీ ఎమ్మెల్యే సందీప్‌కుమార్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో పాటు పిటిషనర్‌కు జరిమానా విధించాలని కోర్టు పేర్కొంది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించినట్టయ్యింది.
కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలన్న పిటిషన్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు, సందీప్‌కుమార్‌ను మందలించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే రెండు పిటిషన్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి కొట్టివేశారని జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ ధర్మాసనం పేర్కొంది. ఈ పరిస్థితిలో తాజా పిటిషన్ ని ఎలా పరిగణలోకి తీసుకోవాలని అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో పిటిషనర్‌కు భారీ జరిమానా విధించాలని కోర్టు ఇర్ణయించింది.
We’re now on WhatsApp. Click to Join
అంతకుముందు జ్యుడీషియల్ కస్టడీ నుంచి కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా పనిచేయలేరని సందీప్ కుమార్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి స్వతంత్రంగా అందుబాటులో ఉంటే తప్ప లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఆచరణాత్మకంగా సాధ్యం కాదని పిటిషన్‌లో పేర్కొన్నాడు. కాగా ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. పది రోజుల ఈడీ రిమాండ్ తర్వాత, రోస్ అవెన్యూలోని ప్రత్యేక కోర్టు అతన్ని జ్యుడీషియల్ కస్టడీ పంపింది. ప్రస్తుతం కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్నారు. ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని కోరుతూ దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది.
Also Read: Jan Lok Poll Survey : అసదుద్దీన్‌కు షాక్.. జన్ లోక్‌పాల్ సర్వేలో సంచలన ఫలితాలు!