Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
- By Pasha Published Date - 04:29 PM, Tue - 25 June 24

Arvind Kejriwal : లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు ఇచ్చిన బెయిల్‌పై స్టే కొనసాగుతుందని జస్టిస్ సుధీర్ కుమార్ జైన్‌తో కూడిన హైకోర్టు వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. ఢిల్లీ సీఎంకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని తప్పు పట్టింది. అది పూర్తిగా అన్యాయమైన తీర్పు అని కామెంట్ చేసింది.
We’re now on WhatsApp. Click to Join
కేజ్రీవాల్‌కు(Arvind Kejriwal) బెయిల్‌ను మంజూరు చేసేటప్పుడు ట్రయల్ కోర్టు మైండ్‌ను వినియోగించలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించిన ఆధారాలను రౌస్ అవెన్యూ కోర్టు సరిగ్గా పరిశీలించి ఉంటే ఇలాంటి తీర్పు ఇచ్చి ఉండేది కాదని పేర్కొంది. వాదనను సమర్పించే అవకాశాన్ని కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు ఇవ్వకుండానే రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఉత్తర్వులను విడుదల చేసిందని హైకోర్టు బెంచ్ తెలిపింది.
Also Read : China – Moon: చైనా ‘చాంగే-6’ రికార్డ్.. చంద్రుడిపై నుంచి ఏం తెచ్చిందో తెలుసా ?
రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించడాన్ని కేజ్రీవాల్ ఇప్పటికే సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు తుది ఆదేశాలు వెలువడిన తర్వాత.. జూన్ 26న (బుధవారం) తాము విచారణ జరుపుతామని సోమవారం రోజు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇవాళ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు వెలువడినందున.. ఇక రేపు (బుధవారం) సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు వెలువడుతాయి అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. బెయిల్‌పై స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు ఎలా పరిగణిస్తుంది అనేది వేచిచూడాలి. మొత్తం మీద కేజ్రీవాల్‌కు బెయిల్ వస్తుందా ? రాదా ? అనే దానిపై రేపు మధ్యాహ్నం కల్లా క్లారిటీ వచ్చేస్తుంది.