HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >The Person Who Killed Telugu Youth Dasari Gopikrishna Was Arrested In America

Dasari Gopikrishna : అమెరికాలో బాపట్ల యువకుడి మర్డర్.. హంతకుడి అరెస్ట్, వివరాలివీ

గత శుక్రవారం(జూన్ 21న) రాత్రి డల్లాస్‌లోని కన్వీనియన్స్ స్టోర్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు దాసరి గోపీకృష్ణ(32) ప్రాణాలు కోల్పోయాడు. 

  • Author : Pasha Date : 25-06-2024 - 2:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dasari Gopikrishna

Dasari Gopikrishna : గత శుక్రవారం(జూన్ 21న) రాత్రి అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం డల్లాస్‌లో ఉన్న ఓ కన్వీనియన్స్ స్టోర్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు దాసరి గోపీకృష్ణ(32) ప్రాణాలు కోల్పోయాడు.  బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన గోపీకృష్ణ(Dasari Gopikrishna)ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గోపీకృష్ణకు భార్య, కుమారుడు ఉన్నారు. గోపీకృష్ణకు రెండున్నరేళ్ల క్రితమే ప్రవలికతో వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నాడు. ఇంకా ఆయన భౌతిక కాయం అమెరికాలోనే ఉంది. దాన్ని ఇవాళ సాయంత్రం భారత్‌కు పంపించే అవకాశం ఉంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతినిధులు, గోపీకృష్ణ స్నేహితులు భారత కాన్సులేట్‌ సహకారంతో అతడి మృతదేహాన్ని బాపట్లలోని స్వగ్రామం యాజలికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

మరోవైపు ఈ కాల్పుల ఘటనపై పోలీసులు నిర్వహించిన దర్యాప్తునకు సంబంధించిన కొత్త అప్‌డేట్ బయటికి వచ్చింది. ఆ స్టోర్‌లో పనిచేస్తున్న గోపీకృష్ణ సహా దాదాపు 13 మందిపై కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి పేరు దావొంట మాథిస్‌ అని.. వయసు 21 ఏళ్లు ఉంటుందని తెలిసింది. ఇతగాడు గన్‌తో గోపీకృష్ణ తలపై అనేక సార్లు కాల్చాడని పోలీసులు తమ ఎఫ్ఐఆర్‌లో ప్రస్తావించారు. స్టోర్‌ నుంచి ఫ్రీగా సిగరెట్ ప్యాకెట్‌ను తీసుకెళ్లేందుకు  దావొంట మాథిస్‌ కాల్పులు జరిపి గోపీకృష్ణ సహా మొత్తం ముగ్గురి ప్రాణాలు తీశాడని విచారణలో గుర్తించారు. స్టోర్‌లో కాల్పులు జరిపి, వెళ్లిపోయేటప్పుడు సిగరెట్ ప్యాకెట్లు సహా పలు వస్తువులను దావొంట మాథిస్‌ తీసుకెళ్లాడని పోలీసులు తెలిపారు. దావొంట మాథిస్‌ క్రిమినల్ రికార్డు ఉందని.. అతడు గతంలోనూ ఈ తరహా దారుణాలకు తెగబడ్డాడని వెల్లడించారు. కాల్పుల్లో ముగ్గురు చనిపోవడంతో దావొంట మాథిస్‌‌పై క్యాపిటల్ మర్డర్‌ కేసును నమోదు చేశారు.

Also Read : Om Birla : లోక్‌సభ స్పీకర్ ఎన్నిక.. ఎన్డీయే అభ్యర్థిగా ఓంబిర్లా.. ‘ఇండియా’ అభ్యర్థిగా కె.సురేష్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • crime
  • Dasari Gopikrishna
  • Telugu Man Died
  • USA

Related News

20 US States On Alert As Venomous Chinese Ant

Chinese Ant: అమెరికాలో చైనా చీమలు కుడితే ప్రాణాపాయం..

అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న చైనాకు చెందిన ‘ఏషియన్ నీడిల్ ఆంట్’ అనే ప్రమాదకరమైన చీమల జాతి గురించి ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చైనా మూలాలు కలిగిన ఈ ‘ఏషియన్ నీడిల్ ఆంట్స్’ ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్, ఫ్లోరిడా, న్యూయార్క్, పెన్సిల్వేనియా సహా సుమారు 20 రాష్ట్రాలకు విస్తరించాయి. ఐదో వంతు అంగుళం పరిమాణంలో, ముదురు గోధుమ లేదా నలుపు రంగులో ఉండే ఈ

    Latest News

    • Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    • TG Inter: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ షెడ్యూల్‌ విడుదల

    • AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

    • Ram Charan: పెద్ది సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది

    • CM Vijay: విజయ్ వ్యక్తిగత జ్యోతిషుడికి ఓఎస్డీ పదవి

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd