Delhi Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఆ ఓటర్లు ఎటువైపు?
ఇక్కడ మొత్తం 750 మురికివాడలు ఉన్నాయి. ఈ మురికివాడల్లో దాదాపు 3 లక్షల కుటుంబాలు నివసిస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వ గణాంకాల ప్రకారం వీటిలో నివసించే వారి సంఖ్య దాదాపు 20 లక్షలు.
- By Gopichand Published Date - 08:54 AM, Wed - 15 January 25

Delhi Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు (Delhi Elections) సంబంధించి రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఎన్నికలకు అన్ని పార్టీలు ముమ్మరంగా సిద్ధమవుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం తారాస్థాయికి చేరుకుంది. సమాజంలోని అన్ని వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పేద ప్రజల ఓట్లను కూడా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పార్టీలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఈ విభాగం ఢిల్లీలో పెద్ద ఓటు బ్యాంకుగా ఉంది. ఈ ఓట్లను సాధించేందుకు బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌లు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ‘స్లమ్ హెడ్ కాన్ఫరెన్స్’ కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అమిత్ షా మురికివాడలకు సంబంధించి పలు వాగ్దానాలు చేశారు.
స్లమ్ ఓటర్లు ఎటువైపు?
గత 10 సంవత్సరాలలో AAP పార్టీకి పెద్ద సంఖ్యలో మురికివాడల ఓటర్ల ఓట్లు లభిస్తున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు ఈ విభాగం నుంచి పెద్ద ఎత్తున ఓట్లు వచ్చాయి. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో దీనిని సాధించేందుకు బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆప్ నిర్వహిస్తున్న ఉచిత విద్యుత్, నీరు, మొహల్లా క్లినిక్‌ల వంటి కార్యక్రమాల కారణంగా ఈ ఓటర్లు పార్టీతో ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి ఆప్- బిజెపి మధ్య బలమైన పోటీ ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ కూడా బలహీనపడిన స్థానాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తోంది.
Also Read: iPhone 15: ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్.. ఐఫోన్ ఈ సిరీస్‌పై భారీ డిస్కౌంట్!
ఢిల్లీ గురించి చెప్పాలంటే.. ఇక్కడ మొత్తం 750 మురికివాడలు ఉన్నాయి. ఈ మురికివాడల్లో దాదాపు 3 లక్షల కుటుంబాలు నివసిస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వ గణాంకాల ప్రకారం వీటిలో నివసించే వారి సంఖ్య దాదాపు 20 లక్షలు. ఢిల్లీలో నమోదైన మొత్తం ఓటర్ల సంఖ్య 1.5 కోట్లు. వీరిలో 10% జనాభా మురికివాడల ఓటర్లు. ఢిల్లీలోని 20 అసెంబ్లీ స్థానాల్లో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ భారీ సంఖ్యను చూసి పెద్ద పెద్ద పార్టీలన్నీ తమవైపుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీలో మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీన ఈ 70 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.