HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Court Summons Assam Cm And Wife

CM Himanta Biswa Sarma: కోర్టులో విచార‌ణ‌కు హాజ‌రైన అస్సాం సీఎం, ఆయన భార్య

  • Author : HashtagU Desk Date : 25-02-2022 - 10:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Himanta Biswa Sarma And Riniki Bhuya
Himanta Biswa Sarma And Riniki Bhuya

అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశ‌ర్మ విచార‌ణ నిమ‌త్తం కోర్టుకు హాజ‌ర‌య్యారు. ఆయ‌న భార్య రింకి భుయాన్ శ‌ర్మ కూడా న్యాయ‌స్థానానికి వ‌చ్చారు. కామ‌రూప్ మెట్రోపాలిట‌న్ చీఫ్ జ్యుడీషియ‌ల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజ‌ర‌యి విచారణ జరిగింది. 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మోడ‌ల్ కోడ్ ఆఫ్ కాండ‌క్ట్‌ను ఉల్లంఘించార‌న్నది వారిపై ఉన్న ప్రధాన ఆరోప‌ణ‌.

ఈ దంప‌తుల ఆధ్వర్యంలో న్యూస్ లైవ్ టీవీ ఛానెల్ ప‌ని చేస్తోంది. ఆ ఎన్నిక‌ల ప్రచార స‌మ‌యం ముగిసినా ఓట‌ర్లను ప్రభావితం చేసేలా కార్యక్రమాల‌ను ప్రసారం చేశారంటూ ఎల‌క్షన్ అధికార్లకు ఫిర్యాదు అందింది. ఆ స‌మ‌యంలో బిశ్వశ‌ర్మ అప్పటి ముఖ్యమంత్రి స‌ర్బానంద సోనోవాల్ కేబినెట్‌లో మంత్రిగా ప‌నిచేసేవారు. గ‌డువు ముగిసినా ఓట‌ర్లను ప్రభావితం చేసేలా టీవీలో ప్రసారం చేయ‌డం ప్రజా ప్రాతినిధ్య చ‌ట్టం సెక్షన్ 126(1)(b) ప్రకారం నేర‌మ‌ని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.

కాంగ్రెస్ పార్టీ తన ఫిర్యాదుకు తగిన ఆధారాలను కూడా స‌మ‌ర్పించింది. ఆధారాల్లో వాస్తవాలు ఉన్నాయ‌ని భావించిన ఎల‌క్షన్ అధికారులు ఆ మేర‌కు కేసు న‌మోదు చేశారు. 2019 ఏప్రిల్ 11న పోలింగ్ జరగాలి. అయితే 10వ తేదీ సాయంత్రం 7.55 గంట‌ల‌కు బిశ్వశ‌ర్మను లైవ్ లో ఇంట‌ర్వ్యూ చేశారు. ఎన్నిక‌ల‌కు కొద్ది గంట‌ల ముందు ఇలా చేయ‌డం అక్రమ‌మ‌ని, ఇది ఓట‌ర్లను ప్రభావితం చేయ‌డానికేన‌ని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.

ఎన్నికల ప్రవర్తన నియ‌మావ‌ళిని ఉల్లంఘించ‌డ‌మే కాకుండా, ప్రజా ప్రాతినిధ్య చ‌ట్టాన్ని కూడా అతిక్రమించార‌ని కాంగ్రెస్ ఆరోపించింది. ఆయ‌న‌ను విచారించ‌డానికి ప్రభుత్వ అనుమ‌తి అవ‌స‌రం లేద‌ని కోర్టు తెలిపింది. మంత్రిగా అధికార హోదాలో ఇంట‌ర్వ్యూ ఇవ్వలేద‌ని, అందుకే కేసు పెట్టడానికి ప్రభుత్వం నుంచి అనుమ‌తి తీసుకోనక్కరలేదని స్పష్టం చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • Chief Minister of Assam
  • Himanta Biswa Sarma
  • Riniki Bhuyan Sarma

Related News

    Latest News

    • విదేశీయులకు గుడ్ న్యూస్ చెప్పిన భార‌త్‌!

    • అంతర్జాతీయ క్రికెట్‌లో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న టీమిండియా కెప్టెన్‌!

    • భారత్‎కు బిగ్ రిలీఫ్..హొర్ముజ్‌ దాటిన 2 భారత ఎల్పీజీ నౌకలు

    • పాక్ క్రికెట్ బోర్డుకు షాక్ ఇచ్చిన జింబాబ్వే స్టార్ పేసర్

    • వేసవిలో బాడీ డీహైడ్రేట్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    Trending News

      • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

      • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

      • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

      • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

      • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd