Rahul Gandhi : రాహుల్ కు తప్పిన పెను ప్రమాదం..
సభ జరుగుతున్న సమయంలో కీలక నేతలందరూ ఉండగానే అకస్మాత్తుగా స్టేజీ కూలిపోయింది. దీంతో అంత ఎవరికీ ఏమైందో అని షాక్ అయ్యారు. కానీ అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు
- By Sudheer Published Date - 05:34 PM, Mon - 27 May 24

కాంగ్రెస్ అగ్ర నేత , ఎంపీ అభ్యర్థి రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి పెను ప్రమాదం తప్పింది. దేశ వ్యాప్తంగా గత కొద్దీ రోజులుగా పలు దశల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరు దశల్లో పోలింగ్ పూర్తి కాగా..చివరి దశ జూన్ 1 న జరగనుంది. ఈ క్రమంలో చివరి దశ పోలింగ్ నియోజకవర్గాల్లో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఇండియా కూటమి బీహార్, పాట్నాలోని పాలిగంజ్‌లో బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, మీసా భారతీ, తేజస్వి యాదవ్ సహా ఇతర ముఖ్యమైన నేతలు హాజరయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక సభ జరుగుతున్న సమయంలో కీలక నేతలందరూ ఉండగానే అకస్మాత్తుగా స్టేజీ కూలిపోయింది. దీంతో అంత ఎవరికీ ఏమైందో అని షాక్ అయ్యారు. కానీ అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. స్టేజ్ కూలిన సమయంలో రాహుల్ గాంధీ మీసా భారతీ చేయి పట్టుకుని ఉన్నారు. వెంటనే భద్రతా సిబ్బంది రాహుల్ వద్దకు చేరుకుని కిందకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో రాహుల్ గాంధీ వారిని వారించి తాను క్షేమంగా ఉన్నట్టు సంకేతమిచ్చారు. ప్రజలవైపు తిరిగి అభివాదం చేస్తూ కిందకు వెళ్లారు. అలాగే, అక్కడే ఉన్న మరికొందరు నేతలు వేదికపైనే ఉన్న తేజస్వి యాదవ్‌ను పట్టుకున్నారు. ఈ ఘటన తో అక్కడి వాతావరణం ఒక్కసారిగా భయాందోళనకారణంగా మారింది.
Read Also : YS Jagan: 12 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజు వైఎస్ జగన్ అరెస్ట్.. ఓడితే అంతే..