HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Confusion At The Ai Summit

AI Summit 2026 : ఏఐ సమ్మిట్లో గందరగోళం!

ప్రపంచ దేశాల నుంచి దిగ్గజ టెక్ నిపుణులు, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వంటి ప్రముఖులు హాజరవుతున్న ఈ సదస్సులో నిర్వహణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి

  • Author : Sudheer Date : 17-02-2026 - 9:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ai Summit Delhi
Ai Summit Delhi

AI Summit 2026 : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ‘గ్లోబల్ ఏఐ సమ్మిట్ 2026’ లో అపశ్రుతులు దొర్లడం చర్చనీయాంశమైంది. ప్రపంచ దేశాల నుంచి దిగ్గజ టెక్ నిపుణులు, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వంటి ప్రముఖులు హాజరవుతున్న ఈ సదస్సులో నిర్వహణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భద్రతా పరమైన కారణాలతో ప్రతినిధుల మధ్య గందరగోళం నెలకొంది. సాంకేతిక ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయాల్సిన వేదికపై, సమన్వయ లోపం వల్ల ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సదస్సులో తమ వినూత్న ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు వచ్చిన ఒక స్టార్టప్ ఫౌండర్‌కు ఊహించని షాక్ తగిలింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో, భద్రతా సిబ్బంది సూచనల మేరకు తమ ప్రదర్శన గది (Stall)లో డివైజ్‌లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. అయితే, ప్రధాని విజిట్ ముగిసిన తర్వాత తిరిగి వచ్చి చూసేసరికి, లక్షల విలువైన ఆ డివైజ్‌లు మాయమైనట్లు సదరు ఫౌండర్ వాపోయారు. అత్యున్నత స్థాయి భద్రత ఉండే ప్రధాని పర్యటన సమయంలోనే వస్తువులు చోరీకి గురవ్వడం, సదస్సు భద్రతా ఏర్పాట్లపై పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చింది.

కేవలం దొంగతనాలే కాకుండా, సదస్సులో జనసమూహాన్ని నియంత్రించడంలో (Crowd Management) కూడా నిర్వాహకులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ల దగ్గర గంటల తరబడి వేచి చూడాల్సి రావడం, సరైన సమాచారం ఇచ్చే సిబ్బంది లేకపోవడంతో అంతర్జాతీయ ప్రతినిధులు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏఐ వంటి అత్యాధునిక అంశంపై జరుగుతున్న సదస్సులో కనీసం ప్రాథమిక ఏర్పాట్లు కూడా సరిగా లేకపోవడంపై టెక్ వర్గాలు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 'గ్లోబల్ ఏఐ సమ్మిట్ 2026'
  • AI Summit 2026
  • Attendees describe experience at AI Summit in Delhi
  • India AI Impact Summit 2026
  • Long queues
  • no water'
  • trending
  • ఢిల్లీ

Related News

    Latest News

    • చిన్నారులపై లైంగిక దాడి..అమెరికాలో భారతీయ యువకుడి అరెస్ట్!

    • New Airports : ఏపీలో ఏకంగా 09 కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు ప్రణాళిక..ఎక్కడెక్కడంటే !!

    • Actress Pratyusha Case : నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడికి సుప్రీం కోర్టు బిగ్ షాక్

    • HYD : దేవుడు బతికిస్తాడని..శవాన్ని ఇంట్లో పెట్టి పూజలు !! ఇదెక్కడి మూఢనమ్మకం !

    • మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్య..

    Trending News

      • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

      • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

      • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

      • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

      • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd