HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Commercial Gas Cylinder Prices Slashed

Commercial cylinder : భారీగా తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర

గ్యాస్ సిలిండర్ల ధరల్లో ప్రతి నెల ఒకటో తేదీన మార్పులు జరుగుతాయి. ఇందులో భాగంగానే ఏప్రిల్ ఒకటో తేదీ నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు ధరల సవరణలు చేశాయి. కొన్ని నెలల నుంచి గృహ అవసరాలకు ఉపయోగించే 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలను స్థిరంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

  • By Latha Suma Published Date - 11:11 AM, Tue - 1 April 25
  • daily-hunt
Commercial gas cylinder prices slashed
Commercial gas cylinder prices slashed

Commercial cylinder : కమర్షియల్ సిలిండర్ ధర భారీగా తగ్గింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా 41 రూపాయలు తగ్గించాయి ఆయిల్ కంపెనీలు. ప్రతి నెల ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు ధరలను సవరిస్తూ ఉంటాయి. ఈ కారణంగా గ్యాస్ సిలిండర్ల ధరల్లో ప్రతి నెల ఒకటో తేదీన మార్పులు జరుగుతాయి. ఇందులో భాగంగానే ఏప్రిల్ ఒకటో తేదీ నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు ధరల సవరణలు చేశాయి. కొన్ని నెలల నుంచి గృహ అవసరాలకు ఉపయోగించే 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలను స్థిరంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా ఎలాంటి మార్పు చేయలేదు. కానీ, వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు ఉపశమనం కల్పించాయి.

Read Also: Conocarpus Trees: కోనోకార్పస్ చెట్లపై అసెంబ్లీలో చర్చ.. ఎందుకు ? ఏమైంది ?

19 కిలోల కమెర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ఒక్కో సిలిండర్‌పై రూ. 41 మేర తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. తగ్గిన ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 1, 2025 నుంచే అమలులోకి వస్తాయని తెలిపాయి. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ. 1803 నుంచి రూ. 1762కి దిగివచ్చింది. ఈ నిర్ణయంతో వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు ఉపశమనం కల్పించనుంది. హైదరాబాద్ నగరం సహా తెలుగు రాష్ట్రాల్లో 19 కిలోల కమెర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1985.50 వద్దకు దిగివచ్చింది. ఇక 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 855 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. దాదాపు అన్ని నగరాల్లో రాయితీ సిలిండర్ ధరలు స్థిరంగానే ఉన్నాయి.

నగరాల వారీగా సిలిండర్ ధరలు ఇలా..

.దేశ రాజధాని ఢిల్లీలో కమెర్షియల్ సిలిండర్ ధర రూ. 41 తగ్గి రూ. 1762 వద్దకు వచ్చింది.
.దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1755.50 నుంచి రూ. 1714.50కి తగ్గింది.
.చెన్నైలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1965.50 నుంచి రూ. 1924.50కి తగ్గింది.
.కోల్‌కతాలో కమెర్షియల్ సిలిండర్ ధర రూ. 1913 నుంచి రూ. 1872 వద్దకు దిగివచ్చింది.

Read Also: Imran Khan : నోబెల్‌శాంతి పురస్కారానికి ఇమ్రాన్‌ పేరు.. తెర వెనుక జెమీమా!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 19-kg cylinder
  • Commercial cylinder
  • delhi
  • Domestic cylinder
  • LPG rates
  • Oil companies

Related News

Air India

Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ఇట‌లీలో చిక్కుకున్న ప్ర‌యాణీకులు!

ఎయిర్ ఇండియా, సహచర విమానయాన సంస్థలలో సీట్ల లభ్యత ఆధారంగా ప్రయాణీకులకు అక్టోబరు 20 నుండి తిరిగి బుకింగ్ చేయబడుతోంది. ఒక ప్రయాణీకుడి వీసా అక్టోబరు 20న గడువు ముగియనుండగా, వీసా నిబంధనల ప్రకారం అతనికి మిలన్ నుండి వెళ్లే మరొక విమానంలో చోటు కల్పించారు.

  • Deepotsav

    Deepotsav: ఢిల్లీ కర్తవ్య పథ్‌లో అద్భుత దీపోత్సవం.. ప్రారంభించిన సీఎం రేఖ గుప్తా!

  • Head Constable

    Head Constable Posts : 509 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు.. అప్లై చేశారా?

Latest News

  • WhatsApp: వాట్సాప్‌లో స్పామ్, అనవసర మెసేజ్‌లకు ఇక చెక్!

  • Air Pollution: వాయు కాలుష్యం.. గర్భంలో ఉన్న శిశువు మెదడుపై తీవ్ర ప్రభావం!

  • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

  • CNG Cars: త‌క్కువ బ‌డ్జెట్‌లో సీఎన్‌జీ కారును కొనుగోలు చేయాల‌ని చూస్తున్నారా?

  • Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!

Trending News

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd