HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Cm Stalin Food Distribution In Cyclone Michaung Effects Areas

Cyclone Michaung: చెన్నైలో మిజామ్ తుఫాను, రంగంలోకి సీఎం స్టాలిన్

మిజామ్ తుపాను ధాటికి రాజధాని చెన్నై అతలాకుతలమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మిజామ్ తుపాను తమిళనాడు ఉత్తర కోస్తాలోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టులో తీవ్ర నష్టాన్ని కలిగించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది

  • Author : Vamsi Chowdary Korata Date : 06-12-2023 - 9:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cyclone Michaung
Cyclone Michaung

Cyclone Michaung: మిజామ్ తుపాను ధాటికి రాజధాని చెన్నై అతలాకుతలమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మిజామ్ తుపాను తమిళనాడు ఉత్తర కోస్తాలోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టులో తీవ్ర నష్టాన్ని కలిగించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో చెన్నైలోని పలు ప్రాంతాలు వరద నీటితో చుట్టుముట్టాయి.

చెన్నైలో వడపళని, చూలైమేడు, కోడంబాక్కం, పెరుంగుడి రాయపేట, ఉరప్పక్కం, హార్బర్, ఎన్నూర్, వ్యాసర్పాడి, సైదాపేట, వేలచ్చేరి, మడిపాక్కం, ముడిచూర్, వరదరాజపురంలో వరదనీరు చేరింది. 47 ఏళ్ల తర్వాత ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురువడంతో చెన్నై నగరంలోని అన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వర్షపు నీరు చేరింది.దీంతో నిత్యావసరాలపై తీవ్ర ప్రభావం పడింది. మూడు రోజులుగా పాలు, నీళ్లు, కరెంటు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో మూడో రోజు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

కార్పొరేషన్ ఉద్యోగులు, అగ్నిమాపక సిబ్బంది, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ మరియు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్‌లో చురుకుగా పాల్గొంటున్నాయి. అలాగే వరద ప్రాంతాలకు హెలికాప్టర్ ద్వారా ఆహార పదార్థాలను అందజేస్తున్నారు. 4 హెలికాప్టర్ల ద్వారా 16 చోట్ల 950 కిలోల ఆహార పదార్థాలను పంపిణీ చేసినట్లు అధికారికంగా సమాచారం అందింది. ఈ మిక్జామ్ తుపాను కారణంగా ఇప్పటివరకు 17 మంది మరణించినట్లు సమాచారం. ఈ సందర్భంగా చెన్నైలో తుపాను ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా పరిశీలించారు. వరద బాధిత ప్రజలకు ఆయన ఆహారం పంపిణీ చేశారు.

Also Read: Sourav Ganguly: రోహిత్ శర్మపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ సంచలన వ్యాఖ్యలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chennai
  • CM Stalin
  • Cyclone Michaung
  • food distribution
  • rains

Related News

Arrest

Chennai : పోలీసే నిందితుడు.. మైన‌ర్‌పై లైంగిక దాడి కేసులో కానిస్టేబుల్ అరెస్ట్‌

భ‌ద్ర‌త క‌ల్పించాల‌న్ని ఖాకీలే నిందితులుగా మారుతున్నారు. త‌మిళ‌నాడులో ఓ మైన‌ర్ బాలుడిపై హెడ్ కానిస్టేబుల్ లైగింక‌దాడి వెలుగులోకి వ‌చ్చింది. రాజధాని చెన్నైలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలపై ఓ హెడ్ కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 25న బాలుడి తల్

  • Weather Update

    Telangana : తెలంగాణ‌లో రుతుప‌వ‌నాలు మ‌రింత ఆల‌స్యం

Latest News

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd