Arvind Kejriwal: ఈడీ విచారణకు కేజ్రీవాల్ ఆరోసారి డుమ్మా
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరుసగా ఆరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు గైర్హాజరయ్యారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఆరోసారి పంపిన సమన్లపై కేజ్రీవాల్ స్పందించలేదు.
- By Praveen Aluthuru Published Date - 01:58 PM, Mon - 19 February 24

Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరుసగా ఆరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు గైర్హాజరయ్యారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఆరోసారి పంపిన సమన్లపై కేజ్రీవాల్ స్పందించలేదు.
మద్యం కుంభకోణం కేసులో సోమవారం తమ ముందు హాజరుకావాలని ఈ నెల 14న కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు పంపింది. కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడంపై ఆప్ స్పందించింది. ఈడీ పంపిన సమన్లు చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ ఆయన ఈడీ ఎదుట హాజరు కాలేదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. కేజ్రీవాల్ హాజరుకాకపోవడంతో ఈడీ ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది. మళ్లీ మళ్లీ సమన్లు పంపకుండా కోర్టు నిర్ణయం కోసం వేచి చూడాలని ఆప్ నేతలు ఈడీకి సూచించారు.
సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ ఇదివరకు ఐదుసార్లు నోటీసులు పంపింది. నవంబర్ 2, నవంబర్ 21, జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కానీ ఈడీ పంపిన సమన్లు చట్టవిరుద్ధమైనవని, రాజకీయ ప్రేరేపితమైనవని ఆరోపిస్తూ కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. తాజాగా ఆరోసారి కేజ్రీవాల్ డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది.
Also Read: Top News Today: దేశవ్యాప్తంగా చర్చనీయ అంశాలు