Cloudburst : జమ్మూకశ్మీర్‌లో ‘క్లౌడ్ బరస్ట్’.. 10 మంది మృతి
ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందిన మాచైల్ మాతా (చండీ) ఆలయానికి యాత్ర ప్రారంభించే బేస్ క్యాంప్. భక్తులు ఇక్కడే వాహనాలు నిలిపి, అక్కడి నుంచే నడక ప్రయాణం మొదలుపెడతారు. ఈ సందర్భంలో క్లౌడ్‌బరస్ట్ సంభవించడంతో, యాత్రికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వరద నీరు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు చేరడంతో కొంతమంది తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది.
- By Latha Suma Published Date - 03:35 PM, Thu - 14 August 25

Cloudburst : జమ్మూ కశ్మీర్‌లోని కిశ్త్వాడ్ జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకున్న భారీ క్లౌడ్‌బరస్ట్ (cloudburst) కారణంగా చోసిటీ గ్రామం ఒక్కసారిగా మెరుపు వరదల బీభత్సానికి గురైంది. ఈ విపత్తు సమయంలో ఆ ప్రాంతంలో మాచైల్ మాతా యాత్రకు వెళుతున్న వేలాది మంది భక్తులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందిన మాచైల్ మాతా (చండీ) ఆలయానికి యాత్ర ప్రారంభించే బేస్ క్యాంప్. భక్తులు ఇక్కడే వాహనాలు నిలిపి, అక్కడి నుంచే నడక ప్రయాణం మొదలుపెడతారు. ఈ సందర్భంలో క్లౌడ్‌బరస్ట్ సంభవించడంతో, యాత్రికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వరద నీరు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు చేరడంతో కొంతమంది తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది.
Read Also: Pakistan : ఆపరేషన్ సిందూర్ ఎఫ్‌క్ట్..పాకిస్థాన్ రాకెట్ ఫోర్స్ ఏర్పాటు
ఈ ప్రమాదంతో పలువురు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు అధికారికంగా మరణాల సంఖ్య నిర్ధారించలేదు కానీ, సహాయక బృందాలు రాత్రి వేళ కూడా శోధన కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. చోసిటీ ప్రాంతంలో మేఘవిసర్జన కారణంగా తీవ్రమైన మెరుపు వరదలు వచ్చాయి. సహాయ చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ఆ ప్రాంతం మాచైల్ మాతా యాత్ర బేస్ క్యాంప్ కావడం వల్ల ఎక్కువ మంది యాత్రికులు అక్కడే ఉన్నారు. వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మేము చర్యలు తీసుకుంటున్నాం అని కిష్త్వాడ్ ఉప కమిషనర్ పంకజ్ శర్మ వెల్లడించారు. దిగుమటి మార్గాలు కొన్నిచోట్ల కటిపోయినట్లు సమాచారం. దీనివల్ల సహాయ బృందాలకు ప్రాంతంలోకి ప్రవేశించడంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ, భారత ఆర్మీ, NDRF బృందాలు హెలికాప్టర్‌లు, డ్రోన్లు ఉపయోగించి బాధితులును గుర్తించేందుకు కృషి చేస్తున్నాయి.
ఇక, కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్పందిస్తూ చోసిటీ క్లౌడ్‌బరస్ట్ ఘటనపై నేను నిరంతరం సమాచారాన్ని స్వీకరిస్తున్నాను. ప్రాణనష్టం జరగకుండా చూసేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన స్పందిస్తున్నారు. అవసరమైన ప్రతి రకమైన సహాయం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పారు. ఇప్పటికే వైద్య సిబ్బంది, రేస్క్యూ టీంలు రంగంలోకి దిగాయని, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. బాధితులకు తాత్కాలిక ఆశ్రయం, ఆహారం, ప్రాథమిక చికిత్స అందించడానికి అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్థానికుల విశ్వాసం ప్రకారం, మాచైల్ మాతా యాత్ర ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రతీవేడీ వేలాదిమంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. అలాంటి సమయంలో ఈ ప్రమాదం సంభవించడం వల్ల, భక్తులూ, వారి కుటుంబసభ్యులూ తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ప్రభుత్వం ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అధికారిక సమాచారం కోసం మాత్రమే వేచి ఉండాలని సూచించింది. స్థానికులు మరియు యాత్రికుల బాగోగులపై నిత్యం మానిటరింగ్ కొనసాగుతోందని వెల్లడించింది.