HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Champai Soren Heads To Delhi With 6 Mlas Amid Speculation Of Bjp Switch

Champai Soren : ఆరుగురు ఎమ్మెల్యేలతో ఢిల్లీకి చంపై సోరెన్.. బీజేపీలో చేరుతారా ?

తమకు అత్యంత విశ్వసనీయుడిగా  భావించబట్టే ఆనాడు సీఎం పదవిని చంపై సోరెన్ చేతిలోపెట్టేందుకు హేమంత్ సోరెన్ సిద్ధపడ్డారు.

  • By Pasha Published Date - 01:04 PM, Sun - 18 August 24
  • daily-hunt
Champai Sarkar Won The Test

Champai Soren : జార్ఖండ్ రాజకీయాల్లో మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) సీనియర్ నేత చంపై సోరెన్ ఒక సంచలనంగా మారారు. ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ఇవాళ ఉదయాన్నే చంపై సోరెన్ (Champai Soren) రాంచీ నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరారు.  ఆయనతో పాటు ఆరుగురు జేఎంఎం ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

చంపై సోరెన్ .. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు. ఈ ఏడాది జనవరి 31న హేమంత్ సోరెన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అరెస్టు చేసింది. దీంతో ఆ వెంటనే జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ బాధ్యతలు చేపట్టారు. తమకు అత్యంత విశ్వసనీయుడిగా  భావించబట్టే ఆనాడు సీఎం పదవిని చంపై సోరెన్ చేతిలోపెట్టేందుకు హేమంత్ సోరెన్ సిద్ధపడ్డారు. హేమంత్ సోరెన్ బెయిలుపై జైలు నుంచి విడుదలయ్యాక జులై 3న సీఎం పదవికి చంపై సోరెన్ రాజీనామా చేశారు.

Also Read :Orphan Girl Gangraped : ఆగి ఉన్న బస్సులో అనాథ​పై గ్యాంగ్​రేప్​

అయితే తనను ఏమాత్రం గౌరవించకుండా అకస్మాత్తుగా సీఎం పదవి నుంచి తొలగించడంపై చంపై సోరెన్ ఆగ్రహంగా ఉన్నారు.  జేఎంఎం ప్రభుత్వాన్ని కష్ట కాలంలో నడిపినందుకు తనకు ఏమాత్రం కనీస గౌరవం లభించలేదనే అభిప్రాయంతో ఆయన ఉన్నారట. జేఎంఎంలో తన లాంటి సీనియర్లకు విలువ లేకుండా పోయిందని చంపై సోరెన్ భావిస్తున్నారట.  అయితే చంపై సోరెన్ వెంట వెళ్లిన ఆరుగురు ఎమ్మెల్యేలను జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ సీనియర్ నేతలు కాంటాక్ట్ చేసేందుకు యత్నించగా.. వారు అందుబాటులోకి రాలేదు. దీంతో నెక్ట్స్ ఏం జరగబోతోంది ? చంపై సోరెన్ ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకోనున్నారా ? అనే సందేహాలు బలపడుతున్నాయి. శనివారం రాత్రి కోల్‌కతాకు వెళ్లిన చంపై సోరెన్ అక్కడ బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారితో భేటీ అయ్యారు. దీన్నిబట్టి తాను బీజేపీకి చేరువ కాబోతున్నాననే సంకేతాలను పంపారు. కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో చంపై సోరెన్ టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని శనివారం రోజు చంపై సోరెన్ ఖండించారు. తాను ఎక్కడున్నానో.. అక్కడే ఉన్నాను కదా అని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read :Srikakulam History : 75వ వసంతంలోకి శ్రీకాకుళం జిల్లా.. చారిత్రక వివరాలివీ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • Champai Soren
  • delhi
  • jharkhand

Related News

Air India

Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ఇట‌లీలో చిక్కుకున్న ప్ర‌యాణీకులు!

ఎయిర్ ఇండియా, సహచర విమానయాన సంస్థలలో సీట్ల లభ్యత ఆధారంగా ప్రయాణీకులకు అక్టోబరు 20 నుండి తిరిగి బుకింగ్ చేయబడుతోంది. ఒక ప్రయాణీకుడి వీసా అక్టోబరు 20న గడువు ముగియనుండగా, వీసా నిబంధనల ప్రకారం అతనికి మిలన్ నుండి వెళ్లే మరొక విమానంలో చోటు కల్పించారు.

  • Deepotsav

    Deepotsav: ఢిల్లీ కర్తవ్య పథ్‌లో అద్భుత దీపోత్సవం.. ప్రారంభించిన సీఎం రేఖ గుప్తా!

  • Bhatti Vikramarka

    Deputy CM Bhatti Vikramarka Mallu : ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్..!

  • Head Constable

    Head Constable Posts : 509 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు.. అప్లై చేశారా?

  • Folk Singer Maithili Thakur

    Bihar Elections : 25 ఏళ్ల సింగర్ కు బీజేపీ ఎమ్మెల్యే టికెట్

Latest News

  • Air Pollution: వాయు కాలుష్యం.. గర్భంలో ఉన్న శిశువు మెదడుపై తీవ్ర ప్రభావం!

  • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

  • CNG Cars: త‌క్కువ బ‌డ్జెట్‌లో సీఎన్‌జీ కారును కొనుగోలు చేయాల‌ని చూస్తున్నారా?

  • Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!

  • Minister Lokesh: ఏపీలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించండి: మంత్రి లోకేష్

Trending News

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd