సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలపై బిగ్ అప్డేట్!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 12వ తరగతి విద్యార్థుల నిరీక్షణ త్వరలో ముగియనుంది. తాజా సమాచారం ప్రకారం.. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు 2026 ఏప్రిల్ చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది.
- Author : Gopi
Date : 18-04-2026 - 10:45 IST
Published By : Hashtagu Telugu Desk
CBSE Class 12 Result: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 12వ తరగతి విద్యార్థుల నిరీక్షణ త్వరలో ముగియనుంది. తాజా సమాచారం ప్రకారం.. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు 2026 ఏప్రిల్ చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. బోర్డు ఇంకా అధికారిక తేదీని ప్రకటించనప్పటికీ గత ఏళ్ల ట్రెండ్స్, మూల్యాంకన వేగాన్ని బట్టి ఈ అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరిలో ప్రారంభమై.. ఏప్రిల్ మొదటి వారం (ఏప్రిల్ 10) వరకు జరిగాయి. సాధారణంగా పరీక్షలు ముగిసిన 3 నుండి 5 వారాల వ్యవధిలో బోర్డు ఫలితాలను విడుదల చేస్తుంది. అందుకే ఏప్రిల్ ఆఖరు లేదా మే మొదటి వారంలో ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది.
గత 5 ఏళ్ల ఫలితాల ట్రెండ్
CBSE 12వ తరగతి ఫలితాల్లో ప్రతి సంవత్సరం ఉత్తీర్ణత శాతం స్వల్ప మార్పులకు లోనవుతోంది.
2025: 88.39% అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు.
2024: 87.98% ఉత్తీర్ణత నమోదైంది.
2023: దాదాపు 87.33% మంది విద్యార్థులు సఫలమయ్యారు.
2022: 92.71% ఉత్తీర్ణత శాతం నమోదైంది.
2021: కరోనా కారణంగా రికార్డు స్థాయిలో 99% పైగా ఉత్తీర్ణత వచ్చింది.
Also Read: Amaravati: రైతులకు గుడ్ న్యూస్.. రూ. 1.50 లక్షల రుణ మాఫీ – చంద్రబాబు
మళ్లీ అమ్మాయిలే పైచేయి?
గత కొన్నేళ్లుగా సాగుతున్న ట్రెండ్ ప్రకారం.. ఈసారి కూడా అమ్మాయిలే అబ్బాయిల కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తారని విద్యావేత్తలు భావిస్తున్నారు. దాదాపు ప్రతి సంవత్సరం బాలికల ఉత్తీర్ణత శాతమే ఎక్కువగా ఉంటోంది.
ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి?
ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు తమ స్కోర్‌ను ఈ క్రింది పద్ధతుల్లో చూడవచ్చు.
అధికారిక వెబ్‌సైట్: cbse.gov.in లేదా results.cbse.nic.in సందర్శించాలి.
యాప్స్: DigiLocker, UMANG యాప్‌ల ద్వారా కూడా మార్క్‌షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఫలితాలను చూడటానికి రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడి సిద్ధంగా ఉంచుకోవాలి.