Canada vs India: ఢిల్లీలో కెనడా హైకమిషన్ వద్ద ఉద్రిక్తత.. భద్రత పెంపు
కెనడా భారత్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోనున్నాయి.ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం తమ దేశ పౌరులకు సలహాలు జారీ చేసింది.
- Author : Praveen Aluthuru
Date : 19-09-2023 - 11:18 IST
Published By : Hashtagu Telugu Desk
Canada vs India: కెనడా భారత్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోనున్నాయి.ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం తమ దేశ పౌరులకు సలహాలు జారీ చేసింది. భారతదేశానికి వెళ్లేవారు జాగ్రత్త పాటించాలని తమ దేశ పౌరులకు సూచించింది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలలో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్ననేపథ్యంలో కెనడా ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఢిల్లీలోని కెనడా హైకమిషన్ చుట్టూ భద్రతను పెంచారు, చాణక్యపురిలోని హైకమిషన్ వెలుపల ఢిల్లీ పోలీసు సిబ్బంది మరియు పారామిలటరీ బలగాలు మోహరించాయి.
కెనడాలో ఖలిస్థాన్ అనుకూల కార్యకర్త హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన తర్వాత ఉద్రిక్తతలు తలెత్తాయి. జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలోని సిక్కు సాంస్కృతిక కేంద్రం వెలుపల నిజ్జర్ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలకు ప్రతిస్పందనగా, భారతదేశంలో ఉన్న కెనడా హైకమిషనర్‌కు భారత ప్రభుత్వం నుండి సమన్లు అందాయి. భారతదేశంలో ఉన్న ఒక సీనియర్ కెనడియన్ దౌత్యవేత్తను భారత్ బహిష్కరించింది. ఈ పరిణామాల ఫలితంగా ఢిల్లీలోని కెనడియన్ హైకమిషన్ తన స్థానిక సిబ్బందిని ప్రాంగణం నుండి వెళ్లిపోవాలని కోరింది మరియు కమిషన్ మూసివేశారు.
Also Read: Women Reservation Bill: మహిళ బిల్లుపై బీజేపీ నేత ఉమాభారతి అసంతృప్తి