CAA : కాసేపట్లో సీఏఏ చట్టం అమలుకు నోటిఫికేషన్.. ప్రధాని మోడీ ప్రసంగం
CAA : ‘పౌరసత్వ సవరణ చట్టం-2019 ’(CAA) ఎంతో వివాదాస్పదంగా మారింది. చాలా వర్గాలు దీన్ని బలంగా వ్యతిరేకిస్తున్నాయి. అయినా మోడీ సర్కారు కీలక ప్రకటన చేయబోతోంది.
- Author : Pasha
Date : 11-03-2024 - 5:44 IST
Published By : Hashtagu Telugu Desk
CAA : ‘పౌరసత్వ సవరణ చట్టం-2019 ’(CAA) ఎంతో వివాదాస్పదంగా మారింది. చాలా వర్గాలు దీన్ని బలంగా వ్యతిరేకిస్తున్నాయి. అయినా మోడీ సర్కారు కీలక ప్రకటన చేయబోతోంది. ‘పౌరసత్వ సవరణ చట్టం-2019 ’కు సంబంధించిన గైడ్ లైన్స్‌తో కాసేపట్లో నోటిఫికేషన్‌ను రిలీజ్ చేయబోతోంది. దీనిపై ఇంకాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ రాత్రిలోగా సీఏఏ గైడ్ లైన్స్‌ను కేంద్ర హోం శాఖ నోటిఫై చేయనున్నట్లు సమాచారం.
We’re now on WhatsApp. Click to Join
- సీఏఏ చట్టం 2019 డిసెంబరులో ఆమోదం పొందింది. దీనికి రాష్ట్రపతి అప్రూవల్ కూడా లభించింది. అయితే ఇప్పటివరకు దీనిపై నిబంధనలను జారీ చేయలేదు.
- ఇవాళ విడుదలయ్యే గైడ్ లైన్స్ ప్రకారం ఇకపై సీఏఏను మన దేశంలో అమలు చేయనున్నారు.
- ఈ వారం చివర్లో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో ఇవాళే సీఏఏ అమలు అంశాన్ని మోడీ సర్కారు తేల్చేయనుంది.
- పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ల నుంచి మనదేశానికి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు అనుకూలమైన నిబంధనలు సీఏఏలో ఉన్నాయి.
- 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఈ రూల్స్ వర్తిస్తాయి. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది.
Also Read :Ghazipur Bus Accident: హై టెన్షన్ వైర్ తగిలి బస్సుకు మంటలు, ఆరుగురు మృతి
అమిత్ షా ఏమన్నారంటే..
‘‘ఎన్నికలకు ముందే సీఏఏ అమల్లోకి వస్తుంది. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ నేతల వాగ్దానమే. దేశ విభజన జరిగినప్పుడు పొరుగు దేశంలో వేధింపులకు గురవుతున్న అల్పసంఖ్యాకుల కోసం కాంగ్రెస్ పార్టీ పౌరసత్వం కల్పిస్తామన్న వాగ్దానం చేసింది. కానీ దానినుంచి వెనక్కి మళ్లింది. సీఏఏ పేరు చెప్పి ముస్లింలను భయపెడుతున్నారు. కానీ ఎవరి పౌరసత్వానికీ ఇబ్బంది ఉండదు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లలో హింసకు గురై మన దేశానికి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం మంజూరు చేయడానికి ఉద్దేశించిన చట్టం ఇది’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల వివరించారు.