UP: జైపూర్ నుంచి నేపాల్ వెళ్తున్న బస్సులో మంటలు…17 మంది ప్రయాణికులు..!!
- By hashtagu Published Date - 08:55 AM, Mon - 14 November 22

జైపూర్ నుంచి నేపాల్ వెళ్తున్న బస్సులో ఒక్కసారి మంటలు చెలరేగాయి. బస్సులో ఉన్న 17 మంది ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సులో నుంచి బయటకు దూకారు. ఈ ఘటన ఇటావాలోని భారతియా కోఠీ సమీపంలో ఆగ్రా లక్నో ఎక్స్ ప్రెస్ వే పై జరిగింది. బస్సులో నుంచి పొగలు రావడాన్ని గమణించిన ప్రయాణికులు బస్సులోనుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. వీరంతా నేపాల్ నివాసితులుగా గుర్తించారు. బస్సు జైపూర్ ుంచి నేపాల్ వెళ్తుండగా మార్గ మధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వెంటనే పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్దమైంది. షాక్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం వెల్లడించారు. ప్రయాణికులు ముందస్తు జాగ్రత్తతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా నేపాల్ కుచెందిన కూలీలుగా గుర్తించారు.U