HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Bride Dies Before Wedding In Punjab

Bride Dies: పెళ్లి ముందు పెళ్లికూతురి మృతి – పంజాబ్‌లో విషాదం

బర్గారి గ్రామానికి చెందిన పూజ అనే యువతి పక్క గ్రామం రౌకేకి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. అతను దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.

  • Author : Dinesh Akula Date : 26-10-2025 - 10:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bride Dies
Bride Dies

Bride Dies: పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌ జిల్లా బర్గారి గ్రామంలో జరిగిన ఓ దుర్ఘటన అందరినీ కలచివేసింది. వివాహానికి ఒక రోజు ముందు పెళ్లికూతురు గుండెపోటుతో మృతి చెందింది. దీంతో ఆనందంగా ఉండాల్సిన పెళ్లింట్లో విషాదం నెలకొంది.

బర్గారి గ్రామానికి చెందిన పూజ అనే యువతి పక్క గ్రామం రౌకేకి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. అతను దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇరువురు కుటుంబాల అంగీకారంతో అక్టోబర్ 24న పెళ్లి జరగాల్సి ఉంది. వరుడు కొన్ని రోజుల కిందటే భారత్‌కు వచ్చి ఏర్పాట్లలో పాల్గొన్నాడు.

అక్టోబర్ 23న పూజ కుటుంబం పెళ్లికి ముందు జాగరణ్ వేడుకను నిర్వహించింది. ఆ వేడుకలో పూజ ఎంతో ఉత్సాహంగా భాంగ్రా నృత్యం చేసింది. అయితే రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆమెకు ముక్కు నుంచి రక్తస్రావం ప్రారంభమైంది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు ఆమె ఇప్పటికే గుండెపోటుతో మరణించిందని తెలిపారు. ఈ వార్తతో గ్రామం మొత్తంలో శోకసంద్రం నెలకొంది.

పూజ తండ్రి హర్జిందర్ సింగ్ మాట్లాడుతూ, “మా అమ్మాయి పెళ్లి కోసం ఎంతో సంతోషంగా సిద్ధమవుతోంది. కానీ ఒక్కసారిగా ఇలా జరిగిపోతుందని ఊహించలేదు. ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు” అని బాధ వ్యక్తం చేశారు.

వధూవరుల కుటుంబాలు పెళ్లి కోసం భారీ ఖర్చులు పెట్టినట్లు, అప్పులు తీసుకున్నట్లు తెలిపారు. ఈ అనుకోని ఘటనతో రెండు కుటుంబాలు ఆర్థికంగా కూడా దెబ్బతిన్నాయి.

వైద్య నిపుణుల ప్రకారం, వేడుకల సమయంలో అధిక శబ్దం చేసే డీజే సౌండ్ (90–120 డెసిబెల్స్‌ వరకు) గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌లకు కారణం కావచ్చని హెచ్చరిస్తున్నారు. పోలీసులు రాత్రి 10 తర్వాత డీజే వినియోగాన్ని నిషేధించినప్పటికీ, ఇంకా చాలామంది అనుమతి లేకుండా వినియోగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bride death
  • DJ Sound
  • faridkot
  • Health News
  • heart attack
  • punjab
  • viral news
  • Wedding Tragedy

Related News

Muskmelon Peel

కర్బూజా పండు కంటే తొక్కలే ఎక్కువ ప్ర‌యోజ‌నం చేకూరుస్తాయా?

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనివల్ల ముఖంలో సహజమైన మెరుపు కనిపిస్తుంది.

    Latest News

    • ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్ర‌క‌ట‌న‌!

    • ఎంత నీరు తాగినా ఇంకా దాహమేస్తోందా?

    • ఐసీయూలో మాజీ క్రికెటర్.. ప్రాణాంతక వ్యాధితో పోరాటం!

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్.. ఎవ‌రీత‌ను?

    Trending News

      • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd