Bomb Blast In School : బీహార్ ప్రభుత్వ పాఠశాలలో బాంబు పేలుడు
బీహార్‌లోని గయా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో బాంబు పేలుడు కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు పాఠశాల విద్యార్థులు గాయపడగా, మరో నలుగురు స్పృహతప్పి పడిపోయారు
- Author : Prasad
Date : 16-07-2022 - 10:14 IST
Published By : Hashtagu Telugu Desk
బీహార్‌లోని గయా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో బాంబు పేలుడు కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు పాఠశాల విద్యార్థులు గాయపడగా, మరో నలుగురు స్పృహతప్పి పడిపోయారు. గయా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) హర్‌ప్రీత్ కౌర్ ఈ సంఘటనను ధృవీకరించారు.
బాధితులకు గాయాలయ్యాయని, వారిని వజీర్‌గంజ్‌లోని ఆసుపత్రిలో చేర్చామని తెలిపారు. వజీర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముర్గియాచక్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం ఉదయం ఈ పేలుడు సంభవించింది. మృతులను సత్యేంద్ర కుమార్ మాంఝీ (10), నీరాజ్ కుమార్ మాంఝీ (9)గా గుర్తించారు. పేలుడు సంభవించినప్పుడు విద్యార్థులు పాఠశాల క్యాంపస్‌లో ఆడుకుంటున్నారని .. పేలుడు ధాటికి నలుగురు విద్యార్థులు కూడా స్పృహ తప్పి పడిపోయారని హర్‌ప్రీత్ కౌర్ తెలిపారు. విచారణ కోసం పాఠశాల వద్ద బాంబు, డాగ్ స్క్వాడ్‌ను పంపామని తెలిపారు. శుక్రవారం రాత్రి కూడా గ్రామంలో మూడు బాంబులు పేలినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. వాజిర్‌గంజ్, గయా జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడంతో పేలిన పాఠశాల ఆవరణలో బాంబు పెట్టే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.