Election Expenditure : ఎన్నికల ఖర్చుల్లో బీజేపీ టాప్
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఖర్చు చేసిన పార్టీల్లో బీజేపీ టాప్ ప్లేస్ లో నిలిచింది.
- By CS Rao Published Date - 02:31 PM, Thu - 22 September 22

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఖర్చు చేసిన పార్టీల్లో బీజేపీ టాప్ ప్లేస్ లో నిలిచింది. ఆ పార్టీఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రూ. 340 కోట్లకు పైగా ఖర్చు చేసింది. కాంగ్రెస్ పార్టీ రూ. 194 కోట్లకు పైగా ఖర్చు చేసిందని ఎన్నికల నివేదికలు చెబుతున్నాయి.
ఎన్నికల సంఘం పబ్లిక్ డొమైన్‌లో ఖర్చుల వివరాలను ఉంచారు. దాని ప్రకారం ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా మరియు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ప్రచారానికి రూ.340 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఉత్తరప్రదేశ్‌లో రూ.221 కోట్లు, మణిపూర్‌లో రూ.23 కోట్లు, ఉత్తరాఖండ్‌లో రూ.43.67 కోట్లు, పంజాబ్‌లో రూ.36 కోట్లు, గోవాలో రూ.19 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు వేదికలో బీజేపీ పొందుపరిచింది.
కాంగ్రెస్ దాఖలు చేసిన నివేదిక ప్రకారం, ఐదు రాష్ట్రాల్లో ప్రచారం కోసం రూ.194 కోట్లకు పైగా ఖర్చు చేసింది. బీజేపీ, కాంగ్రెస్‌లు జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు ఎన్నికల వ్యయ నివేదికలను నిర్ణీత కాలవ్యవధిలో EC ముందు సమర్పించాల్సి ఉంటుంది. ఆ మేరకు ఆ రెండు పార్టీలు సమర్పించిన నివేదికల ప్రకారం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఖర్చు తేలింది.
Related News

Telangana : హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా పోస్టర్లు
ఈ పోస్టర్లలో బీఆర్‌ఎస్ అంటే డీల్ అని, తెలంగాణలో అతిపెద్ద ఎమ్మెల్యేల కొనుగోలుదారు అని రాసి ఉంది.