HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Bjp Operation Is This The Connection Between Lalu Jail And Advanis Rath Yatra

BJP Operation : లాలూ జైలుకు.. అద్వానీ ర‌థ యాత్ర‌కు సంబంధం ఇదేనా..?

ఎంతటి పెద్ద నాయ కుడైనా అవినీతి మరక అంటితే ఎలా కుదేలుడై పోతాడో  లలూప్రసాద్ యాదవ్ వ్యవహారమే (BJP Operation) ఒక ఉదాహరణ .

  • By CS Rao Published Date - 03:04 PM, Fri - 27 January 23
  • daily-hunt
BJP Operation
Lalu

ఎంతటి పెద్ద నాయ కుడైనా అవినీతి మరక అంటితే ఎలా కుదేలుడై పోతాడో  లలూప్రసాద్ యాదవ్ వ్యవహారమే (BJP Operation) ఒక ఉదాహరణ . అందరూ లాలూ పెద్ద అవినీతి పరుడని , కుంభకోణ కుట్ర దారుడు అని అనుకుంటూ ఉంటారు. కానీ అసలు మూలాలలోకి వెళ్ళి తొంగిచూస్తే అసలు విషయం తెలుస్తుంది . పశుగ్రాస కుంభకోణం వెలుగు చూసి నప్పుడు అధికారులు అద్వాణీ తో రాజీ చేసుకోమని లలూకు చెప్పారట . దానికి లలూ అంగీకరించ లేదట. ఇంకా లోతుకు వెళ్ళి శోధిస్తే అద్వానీ రధయాత్రను లలూ ప్రభుత్వం సమస్తిపూర్ లో నిలువరించినందుకు అద్వాణీ మెప్పు కోసం బిజెపి లలూ(Lallu prasad) మీద పగ తీర్చుకుంటున్నట్లు పైకి చూపిస్తున్నారు .

లలూప్రసాద్ యాదవ్ వ్యవహారమే (BJP Operation)

లలూ అంటే మనకు కనిపించేది ఆవులు, ఇతర పశువులకు మేతవేస్తూ కనిపించే ఒక సాధారణ వ్యక్తి . ఈయనకు రాజకీయం చేతకాదు, అవినీతి పరుడు అని అనుకుంటారు అందరూ. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఉద్యమం నుండీ చురుకైన నాయకుడు , డేరింగ్ , డాషింగ్ నాయకుడని చాలా మందికి తెలియదు. ఇప్పటి కాలంలో ఎంతటి అవినీతి అయినా కప్పి పుచ్చుకోవడం(BJP Operation) తేలిక. ఒక వేళ అవినీతి ఆరోపణలు వచ్చినా సిబిఐ , ఇడి దాడులు జరిగినా వెంటనే ముడుపులు చెల్లించి బిజెపి లో చేరిపోతే వెంటనే వారు పునీతులై పోతున్నారు.

Also Read : BJP : రాహుల్ గాంధీ వాజ్ పేయి సమాధి సందర్శన పై బీజేపీ విమర్శలు

మోదీ , అమిత్ షా ఆద్వర్యంలోని బిజెపి ప్రభుత్వం , రాజ్యాంగ వ్యవస్థలను స్వప్రయోజనాల కోసం ప్రత్యర్ధులను , ఇతర పార్టీల నేతలను బెదిరించ డానికి ఉప‌యోగిస్తున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. వీలైతే ప్ర‌త్య‌ర్థుల‌ను దారికి తెచ్చుకోవడానికి దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నార‌ని భావిస్తున్నారు. మోదీ, షా మాట వినని ఎంతటి వారికైనా ఇదేగతి పడు తుందని ప‌లు సంద‌ర్భాల్లో ప‌లు రాష్ట్రాల్లో నిరూపించారు. బిజెపి యేతర పార్టీలు , సంస్థలు మీద దాడులు చేయని వారంటూ లేరు. అందరి మీదా రకరకాల దాడులు జరిగాయని, ఇంకా జరుగుతూనే ఉంటాయని చెబుతున్నారు. నితీష్ కుమార్ తోక జాడించడంతో మూలన పడిన కేసులను దులిపి లలూ(Lallu Prasad)ని , తేజస్విని మరలా సి.బి.ఐ కేసుల్లో ఇరికిం చాలని కొత్త నాటకాలకి తెర దీశారని విమ‌ర్శ‌లు ఉన్నాయి.

సరికొత్త ఆరోపణలు చేర్చి వేదింపులు మొదలు

లాలూ రైల్వే మంత్రిగా ఉండగా ఉద్యోగ నియామక దారుల నుండి భూములు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చా రనే గత ఆరోపణలకు , సరికొత్త ఆరోపణలు చేర్చి వేదింపులు మొదలు పెట్టారట. లాలూ , కుమారుడు తేజస్వి , ఇద్దరు కుమార్తెలపై ఇలా మొత్తం పద హారు మందిపై సిబిఐ కేసులు వేసింది. ఆ ఆరోపణలు ఋజువు కాలేదు. లాలూ కుమారుడు తేజస్వి అక్రమ ధనంతో గురు గ్రాం లో అర్బన్ క్యూబ్స్ అనే పెద్ద మాల్ నిర్మించాడని ఆరోపించింది. దీన్ని కూడా ఓజువు చేయ పోయింది సి.బి.ఐ . అది నాది కాదని వైట్ ల్యాండ్ కార్పొరేషన్ లిమిటెడ్ చెందినదని , అందులో బిజెపి ఎం.పి పెట్టు బడి ఉందని ఎదురు దాడికి దిగాడట తేజస్వి. మాల్ ప్రారంభోత్సవం హర్యానా సి.ఎం , బిజెపి నాయకుడు మనోహర్ ఖట్టర్ చేసారని చెప్పడం జరిగిందట. ఇక ఈ మాల్ ఎవరిదో తేల్చ వల్సిన భాద్యత సిబిఐ మీద పడింది. ఇక వాటిని మరుగున పరచి ఇప్పుడు కొత్త పల్లవిని ఎత్తు కుంది .

Also Read : BBC Modi : మోడీకి US, UK మ‌ద్ధ‌తు,BBC డాక్యుమెంట‌రీ ప‌క్ష‌పాత‌మ‌ని తేల్చివేత‌

రైల్వే ఉద్యోగాలు కల్పించి నందుకు 1450 మంది దగ్గర నుండి భూము లను లంచం కింద తీసు కున్నారని , ఆ వివరాలు హార్డ్ డిస్క్ లో దొరికాయని సి.బి.ఐ ఆరోపణ చేస్తోంది. వాటిని చూపి లాలూ , తేజస్విని అరెస్ట్ లు జరుగుతాయని ఊహిస్తున్నారు. నితీష్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఉప సంహరించాలని కోరుతూ వేచి చూసే ధోరణిని అవలంభిస్తోంది అని చెబుతున్నారు. పదహారు కేసుల్లో తిరుగులేని సాక్షాలు న్నాయని బెదిరిస్తున్నారట. ఆ రోజున అద్వానీ తోటే లలూ రాజీ పడలేదు. నేడు తేజస్వీ మోదీ తోటి రాజీకి రావడం లేదు. సి.బి.ఐ ఆరోపణలు చేస్తున్నది లలూ పైనే అయినా అసలు తమ గురి తేజస్వీ మీదే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ గమనించ వల్సిన విషయం ఒకటి ఉంది.

Also Read : Modi with Advani: అద్వానీతో మోడీ.. బీజేపీ కురవృద్ధుడికి శుభాకాంక్షల వెల్లువ!

ఏ దశ లోనూ , ఏ సమయం లోనూ బి.జె.పి తో చేతులు కలపని ఒకే ఒక్క పార్టీ లలూ రాష్ట్రీయ జనతా దళ్ మాత్రమే. రాజకీయంగా నితీష్ ను , తేజస్వినీ ఎదగ నీయ కూడదనేదే బిజెపి ఇద్దరు లేతల లక్ష్యం. తండ్రీ, కొడుకులు పోరాటాలకు సిద్ధమై ఉన్నారు. లలూ ఎలాగూ వయో భారంతో ఉన్నాడని , తన రాజకీయ చరిత్ర ముగిసి పోయిందని , భవిష్య నేతగా తేజస్వి ఎదగాలంటే రాజీకి రాక తప్ప దని , లలూ దారికి వస్తాడని , దాని కోసం బిజెపి నేతలు వేచి చూస్తున్నారని చెబుతున్నారు. బి.జె.పి తో ఉంటే మహారాష్ట్ర ప్రభుత్వానికి మూడినట్లు తనకు మూడుతుంది అని కనిపెట్టిన నితీష్ , బి.జె.పి తో తెగ తెంపులు చేసుకుని ఆర్.జె.డి , వామపక్షాలతో కల్సి మహాఘట్ బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం బి.జె.పి కి తల కొట్టేసినట్లు అయ్యింది. ఆగస్ట్ 24 నితీష్ కొత్త ప్రభుత్వం విశ్వాస పరీక్ష తీర్మానం నెగ్గే కొద్ది గం.ల ముందు సి.బి.ఐ బృందాలు ఆర్.జె.డి నాయకులపై వరుస దాడులు చేసింది. మొదటగా రైల్వే ఉద్యోగాల్లో అక్రమాల పేర ఐదు విక్రయ పత్రాలు దొరికాయని చెప్పి ఇప్పుడు రెండు వందలు దొరికాయని సి.బి.ఐ చెబుతోంది .


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bihar CM Nitish Kumara
  • CBI raids premises of RJD leaders
  • LK Advani
  • tejaswi yadav

Related News

    Latest News

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd