Hindi Belt : మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో బీజేపీ ముందంజ.. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ లీడ్
Hindi Belt : మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఓట్ల లెక్కింపులో బీజేపీ దూసుకుపోతోంది.
- By Pasha Published Date - 09:47 AM, Sun - 3 December 23

Hindi Belt : మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఓట్ల లెక్కింపులో బీజేపీ దూసుకుపోతోంది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో 128 చోట్ల బీజేపీ లీడ్‌లో ఉండగా, 98 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఇక 199 స్థానాలకు పోలింగ్ జరిగిన రాజస్థాన్ రాష్ట్రంలో 102 చోట్ల బీజేపీ, 80 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. ఇక ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాలకుగానూ కాంగ్రెస్ 52 చోట్ల, బీజేపీ 36 చోట్ల లీడ్ లో ఉన్నాయి. ఈ లెక్కన ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగానే రిజల్ట్స్ వస్తున్నట్లుగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
2018 ఎన్నికల ఫలితాలను చూస్తే.. హిందీ బెల్ట్‌లోని ఈ మూడు రాష్ట్రాల్లోనూ అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఆవిర్భవించింది. మూడుచోట్ల కాంగ్రెసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 2020లో మధ్యప్రదేశ్‌కు చెందిన నాటి కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా రెబల్ గా మారి 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరారు. దీంతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కారు పడిపోయింది. సీఎం శివరాజ్ సారథ్యంలో బీజేపీ సర్కారు ఏర్పడింది. ఈనేపథ్యంలో ఈసారి ఎలాగైనా ఈ మూడు హిందీ బెల్ట్ రాష్ట్రాలపై పట్టు సాధించాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. అలాగైతేనే 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఢీకొనగలుగుతామని కమలదళం(Hindi Belt) భావిస్తోంది.